న్యూ ఇయిర్ స్పెషల్: నాగ్,సమంత కలిసి..(వీడియో)

By Srikanya

హైదరాబాద్ :నాగార్జున,సమంత కలిసి గతంలో మనం చిత్రం చేసారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలో పాల్గొననున్నారు. అది మరేదో కాదు...మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ రోజు(డిసెంబర్ 31) రాత్రి 11 గంటలకు మా టీవిలో ప్రసారమయ్యే ఎపిసోడ్ లో న్యూ ఇయిర్ స్పెషల్ గా సమంత పాల్గొని అలరించనుంది. ఈ మేరకు టీజీర్ ని సైతం విడుదల చేసారు. ఆ టీజర్ ని మీరు చూడండి...

అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్ రేటింగ్స్ సాధించింది.

నాగార్జున హోస్టుగా మా టీవీలో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌లతో దూసుకుపోతున్న షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' . ఇప్పుడు సెకండ్‌ సెషన్‌ ప్రారంభమయ్యింది. డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభం మయిన ఈ షోలో హీరో నితిన్‌ అతిధిగా వచ్చారు. ఫస్ట్‌ సెషన్‌ మధ్య మధ్యలో పలువురు స్టార్స్‌ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే రెండో సీజన్లో కూడా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

Samantha

ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈ అండ్ వై) పర్యవేక్షణలో ఎంట్రీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత దశగా 1500 మంది నుంచి 100 పోటీదారులను ఎన్నుకున్నట్లు మాటీవీ తెలిపింది. ఈ షోలో నాగార్జున అడిగే 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా కంటెస్టెట్ కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X