మామ ప్లేస్ ను సామ్ రీప్లేస్ చేయనుందా .?
కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ 4 షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో.. నాలుగో సీజన్ కొనసాగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఎంటర్టైన్మెంట్ కి దూరమైన జనాలకు 'బిగ్ బాస్' సీజన్ 4 కాస్త ఉపశమనం కలిగిస్తుంది. షో మొదలైన టైం లో చప్పగా సాగిన బిగ్ బాస్ ఇప్పుడు ఊపందుకుంది.
హౌజ్‌లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు, లవ్ స్టోరీలు, గొడవలు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోలతో, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది. అయితే నాగ్ బిగ్ బాస్ తో పాటు తన నెక్స్ట్ సినిమా వైల్డ్ డాగ్ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను సోలమన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే 70 షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాను తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మనాలిలో జరగనుంది. ఇందుకోసం నాగ్ కులుమనాలి వెళ్లల్సి ఉంది. ఈ కారణముగా బిగ్ బాస్ షోకు నాగ్ బంక్ కొట్టబోతున్నాడని తెలుస్తుంది. అయితే నాగ్ ప్లేస్ ను కోడలు సమంత రీప్లేస్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నాగ్ రికమెండ్ చేయడంతో సామ్ కూడా బిగ్ బాస్ హోస్ట్ చేయడానికి ఒప్పుకుందని టాక్. అయితే గతంలో నాగ్ స్పెషల్ చార్టెడ్ విమానం లో ప్రతి వారం వచ్చి వెళ్తారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పడు మామ కోసం సమంత రంగం లోకి దిగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో .


Click it and Unblock the Notifications











