అదిరింది నుంచి తప్పుకున్న యాంకర్.. వీడియోతో సీక్రెట్ రివీల్!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రజాధరణ పొందిన షోగా నిలిచింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే ఇది విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఈ షోకు పని చేసి ఎంతో పాపులర్ అయిన డైరెక్టర్లు, టీమ్ లీడర్లు, జడ్జ్ కలిసి మరో చానెల్‌లో మొదలు పెట్టిన షోనే 'అదిరింది'. ఇటీవల ఈ షో నుంచి యాంకర్ సమీరా తప్పుకుంది. దీంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీని వెనుక అసలు రహస్యాన్ని ఆమె రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

అదిరింది మొదలవడానికి కారణం ఆ ఇద్దరే

అదిరింది మొదలవడానికి కారణం ఆ ఇద్దరే

ఇప్పటి వరకు తెలుగులో జబర్ధస్త్ మాత్రమే ఎక్కువ కాలం ప్రసారం అవుతోన్న కామెడీ షోగా నిలుస్తోంది. ఈ షో అంతగా పాపులర్ అవడం వెనుక నితిన్, భరత్ అనే ఇద్దరు దర్శకుల పాత్ర ఎంతో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం ఆ ఇద్దరే జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పడంతో పాటు మరో చానెల్‌లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు.

అందరూ అక్కడి వాళ్లే.. ఇక్కడ కొంచెం ఎక్కువే

అందరూ అక్కడి వాళ్లే.. ఇక్కడ కొంచెం ఎక్కువే

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌లో కీలకంగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబుతో పాటు టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, వేణు, ధన్‌రాజ్ సహా పలువురు ఆర్టిస్టులు అదిరింది షోకు వచ్చారు. అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. దీంతో మిగిలిన వాళ్లు కూడా ఈ షో వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

పది ఎపిసోడ్స్‌కే ఆమెను పక్కన పెట్టేశారు

పది ఎపిసోడ్స్‌కే ఆమెను పక్కన పెట్టేశారు

‘అదిరింది' షో ప్రారంభమై కేవలం పది వారాలు మాత్రమే అవుతోంది. జబర్ధస్త్‌కు పోటీగా మొదలైన ఈ షో.. టీఆర్పీ రేటింగ్‌లో దాన్ని అందుకోలేకపోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి యాంకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్‌ను పక్కన పెట్టేశారు షో నిర్వహకులు. పది వారాలకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

యాంకర్ ఔట్.. వాళ్ల తీరుపై అనుమానాలు

యాంకర్ ఔట్.. వాళ్ల తీరుపై అనుమానాలు

షో మొదలైన పది ఎపిసోడ్లకే యాంకర్ తప్పుకోవడంతో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి తోచిన విధంగా వాళ్లు కారణాలు చెబుతూ వస్తున్నారు. ప్రేక్షకుల్లో కొందరు షో నిర్వహకులకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం సమీరా వైపు నిలుస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

వీడియోతో సీక్రెట్ రివీల్ చేసిన సమీరా షరీఫ్

వీడియోతో సీక్రెట్ రివీల్ చేసిన సమీరా షరీఫ్

‘అదిరింది' షో నుంచి తప్పుకోవడం.. అదే సమయంలో తనపై వస్తున్న వార్తలు చేసిన సమీరా.. ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ‘నేను షో నుంచి తప్పుకోలేదు. నాతో 26 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లే నన్ను తీసేశారు. ఆ విషయం కూడా నాకు డైరెక్టుగా చెప్పలేదు' అని పేర్కొంది.

ప్రెగ్నెంట్ అంటున్నారు.. అందుకే ఇలా డిసైడ్

ప్రెగ్నెంట్ అంటున్నారు.. అందుకే ఇలా డిసైడ్

ఇదే వీడియోలో సమీరా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘అదిరింది లేటెస్ట్ ప్రోమోలో నేను లేకపోయే సరికి చాలా మంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. అదీ కాక నేను ప్రెగ్నెంట్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ కాదు.. వాళ్లే నన్ను తీసేశారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్' అని చెప్పుకొచ్చింది.

తనను తీసేయడంపై సమీరా స్పందన ఇదే

ఈ షో నుంచి తనను తప్పించడంపై సమీరా ఈ వీడియోలో స్పందించింది. ‘షో ప్రయోజనాల కోసం వాళ్లు నన్ను తప్పించారనుకుంటా. నేను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నాకూ ప్రొడక్షన్ హౌస్ ఉంది. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మీరంతా అదిరింది షోను మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా. అదిరింది.. ఇంకా అదిరిపోవాలి' అని ముగించింది.

Recommended Video

Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth || Filmibeat Telugu
సమీరా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

సమీరా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

అదిరింది షోకు యాంకర్‌గా వచ్చిన సమీర 2006లోనే టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ చానెళ్లలో ప్రసారం అయిన ‘ఆడపిల్ల', ‘అభిషేకం', ‘భార్యమణి', ‘మూడు ముళ్ల బంధం', ‘ప్రతిబింబం', ‘మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించింది. దీంతో నటిగా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. యాంకర్‌గా మాత్రం వెంటనే ప్యాకప్ చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X