ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్: అతడితో కలిసి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొంత మంది మాత్రమే ప్రజాధరణ పొందడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మిగిలిన వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలోకే ఓ యాంకర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. నిన్న గాక మొన్న టెలివిజన్‌పైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి కొద్ది రోజులకే బిగ్ షాక్ తగిలింది. ఇంతకీ ఎవరా యాంకర్.? ఆమెకు తగిలిన షాక్ ఏంటి.? మధ్యలో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు.? అనేవి తెలియాలంటే పూర్తిగా చదవాల్సిందే.!

జబర్ధస్త్‌కు పోటీగా వచ్చిన అదిరింది

జబర్ధస్త్‌కు పోటీగా వచ్చిన అదిరింది

జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మరో చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అదిరింది' అనే పేరుతో వచ్చిన ఈ షో కూడా కామెడీ స్కిట్లతో రూపొందించారు. దీనికి నాగబాబుతో పాటు హీరో నవదీప్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, చమ్మక్ చంద్ర, వేణు, ధన్‌రాజ్, కిర్రాక్ ఆర్పీ, సద్దాం టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

కొత్తదనం కోసం పాత హీరోయిన్ వచ్చింది

కొత్తదనం కోసం పాత హీరోయిన్ వచ్చింది

ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు హాట్ లేడీస్ అనసూయ, రష్మీ. వీళ్లకు పోటీగా అదరింది టీమ్ కూడా టీవీ సీరియల్ హీరోయిన్‌ సమీరా షరీఫ్‌ను దించింది. ఈమె యాంకర్‌గా పని చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఎన్నో టీవీ సీరియల్స్ చేసిన సమీరా.. యాంకర్‌గా మెప్పించలేకపోతుందన్న టాక్ వినిపిస్తోంది.

సమీరా అసలేం చేసిందో మీకు తెలుసా.?

సమీరా అసలేం చేసిందో మీకు తెలుసా.?

అదిరింది షోకు యాంకర్‌గా వచ్చిన సమీర 2006లోనే టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ప్రముఖ చానెళ్లలో ప్రసారం అయిన ‘ఆడపిల్ల', ‘అభిషేకం', ‘భార్యమణి', ‘మూడు ముళ్ల బంధం', ‘ప్రతిబింబం', ‘మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించింది. దీంతో నటిగా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. యాంకర్‌గా మాత్రం వెంటనే ప్యాకప్ చెప్పేసింది.

ఆదిలోనే లేడీ యాంకర్‌కు బిగ్ షాక్

అదిరింది షో ఇప్పుడిప్పుడే ప్రజాధరణను పొందుతోంది. యూట్యూబ్‌లో ఈ షోకు సంబంధించిన స్కిట్లకు వచ్చే వ్యూస్‌ను బట్టి ఈ విషయం అర్థం అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ షోలో యాంకర్‌గా చేస్తున్న సమీరను తప్పించారని తెలుస్తోంది. దీనికి కారణం తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో ఆమె యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వకపోవడమేనని అంటున్నారు.

అతడితో వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్

అతడితో వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్

ఇక, ఈ షో ప్రోమోలో సమీర స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో కూడా రివీల్ చేశారు. గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్ -2కు కంటెస్టెంట్‌గా వ్యవహరించిన తెలుగమ్మాయి భాను శ్రీతో పాటు రవి యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అదిరిందికి కొత్త యాంకర్ వస్తోందని జడ్జ్ నవదీప్ ప్రకటించిన వెంటనే భానూ ఎంటర్ అవగా.. ఆ తర్వాత రవి కూడా వచ్చాడు.

Recommended Video

Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth || Filmibeat Telugu
అప్పుడు పవన్... ఇప్పుడు నాగబాబు

అప్పుడు పవన్... ఇప్పుడు నాగబాబు

తాజాగా విడుదలైన అదిరింది ప్రోమోలో జడ్జ్ నాగబాబు గెటప్ కూడా అదిరిపోయింది. గతంలో పవన్ కల్యాణ్ కనిపించిన లుక్‌లో ఇప్పుడు ఆయన కనిపించడం మెగా ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే, ఈ ప్రోమోలో ఓ మిమిక్రి ఆర్టిస్టు వచ్చి పవన్ కల్యాణ్ గొంతును అచ్చం దించేయడంతో నాగబాబు ఆనందం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X