నాకు ఆ హీరోతో ఎఫైర్ ఉందని చెప్పింది.. పక్కనే ఉంటూ గోతులు తవ్విందామె: సమీరా సంచలన వ్యాఖ్యలు
బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు.. అందులో నటించే నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు టెలివిజన్ రంగంలో చాలా మంది ఈ తరహాలో పాపులర్ అయ్యారు. అందులో ప్రముఖ బుల్లితెర హీరోయిన్ సమీరా షరీఫ్ ఒకరు. దాదాపు పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చినా వెంటనే మాయమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొందామె. ఇందులో తన ఎఫైర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా ఎంటర్ అయింది.. వెంటనే పాపులర్
2006లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'ఆడపిల్ల' అనే సీరియల్‌తో సమీరా షరీఫ్ తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయిన ఆమె.. మంచి పేరును సంపాదించుకుంది. ఆ క్రమంలోనే 'అభిషేకం', 'భార్యమణి', 'మూడు ముళ్ల బంధం', 'ప్రతిబింబం', 'మంగమ్మ గారి మనవరాలు'తో పాటు పలు తమిళ సీరియళ్లలోనూ నటించిందామె.

ఇక్కడ ఆపేసింది.. అక్కడ మాత్రం బిజీగా
తెలుగులో చాలా కాలం పాటు వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడిపిన సమీరా షరీఫ్.. 2016లో వచ్చిన 'మంగమ్మ గారి మనవరాలు' తర్వాత ఆమె మరో దానిలో నటించలేదు. కానీ, తమిళంలో మాత్రం వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉంది. దీంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇక, ఈ మధ్యనే ప్రముఖ చానెల్‌లో 'అరవింద సమేత' అనే దానితో రీఎంట్రీ ఇచ్చింది.

యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.. వెంటనే ఔట్
సీరియల్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమీరా షరీఫ్.. తెలుగు బుల్లితెరకు సుదీర్ఘ విరామం తీసుకుంది. ఈ క్రమంలోనే కెరీర్‌లో 'అదిరింది' అనే కామెడీ షోతో తొలిసారి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు పది ఎపిసోడ్ల వరకూ అందులో కనిపించిన ఈమె.. ఆ తర్వాత షోకు దూరమైపోయింది. ఆ సమయంలో తనకు చెప్పకుండానే దీని నుంచి తప్పించారని ఆరోపించింది.

సీరియల్ హీరోతో ప్రేమ.. వెంటనే వివాహం
వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సినీ నటి సన కుమారుడు, సీరియల్ హీరో సయ్యద్ అన్వర్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది సమీరా షరీఫ్. పెళ్లి తర్వాత కొంత స్పీడు తగ్గించిన ఈ అమ్మడు.. భర్త సహాయంతో యూట్యూబ్‌లో మాత్రం వీడియోలు చేస్తోంది. అలాగే, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. అన్వర్ మాత్రం తమిళంలో వరుసగా సీరియళ్లు చేస్తున్నాడు.

హీరోతో ఎఫైర్‌పై సమీరా సంచలన వ్యాఖ్యలు
సమీరా షరీఫ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కీలక సంఘటనల వెనకున్న ఎన్నో సీక్రెట్లను రివీల్ చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఓ సీరియల్ హీరోతో ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది సమీరా.

నాకు ఆ హీరోతో ఎఫైర్ ఉందని చెప్పిందామె
తెలుగులో సీరియల్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమయంలో సమీరా షరీఫ్.. ఓ ప్రముఖ నటుడితో ఎఫైర్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. 'నా గురించి అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవి ఎవరి వల్ల వచ్చాయో చాలా ఆలస్యంగా తెలిసింది. నేను అక్కలా భావించిన వ్యక్తే ఆ పుకార్లు పుట్టించింది' అని చెప్పింది.

పక్కనే ఉంటూ ఆమె గోతులు తవ్విందంటూ
దీనిని కొనసాగిస్తూ.. 'నేను ఓ నటిని అక్కలా భావించేదాన్ని. ఆమెతోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉండేదాన్ని. అలాంటిది ఆమె నాకు సదరు హీరోకు ఎఫైర్ ఉందని ప్రచారం చేసింది. పక్కనే ఉంటూ గోతులు తవ్వింది. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత ఆమెతో మాట్లాడడం మానేశాను. ఆమెతోనే కాదు.. అప్పటి నుంచి ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు' అంటూ సమీరా వివరించింది.


Click it and Unblock the Notifications











