బిగ్ బాస్ ఇష్యూ: తొలిసారి మీడియా ముందుకు సంపూ, ఇదీ జరిగింది...

బిగ్ బాస్ షో గురించి సంపూ మీడియాతో మాట్లాడారు. షో నుండి బయటకొచ్చాక తొలిసారి టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు.

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Telugu : Sampoornesh Babu Reacted About His Issue In Bigg Boss

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు 'బిగ్ బాస్' షోలో అవకాశం దక్కించుకోవడం, రెండు వారాలు కూడా గడవక ముందు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సంపూ బయటకు వచ్చాక రకరకాల ప్రచారం జరిగింది.

ఆ షో నుండి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన విమర్శలు, పుకార్లపై సంపూ సోషల్ మీడియా ద్వారా మాత్రమే స్పందించారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. తాను బయటకు రావడానికి గల కారణాలు వెల్లడించేందుకు సంపూ తొలిసారి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

నాలుగు గోడల మధ్య ఉండలేక పోయా

నాలుగు గోడల మధ్య ఉండలేక పోయా

‘నేను చాలా ఫ్రీ గా తిరిగే మనిషిని. ‘బిగ్ బాస్' ఇంట్లో నాలుటగు గొడల మధ్య ఉండలేక పోయాను. ఇంట్లో నాకేంటో శ్వాస ఆడనట్టుగా, ఏదో అయిపోతున్నట్టు అనిపించడంతో టెన్షన్ కు గురయ్యా. అక్కడి పరిస్థితులను తట్టుకోలేకే బయటకు వచ్చాను అని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

తారక్ అన్న కోసమే

తారక్ అన్న కోసమే

‘బిగ్ బాస్'లో ఆఫర్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే, తారక్ అన్న హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలో చాలామందిని కలిశాను. కానీ, తారక్ అన్నను కలవలేదు. ఈ షోకు వారానికొకసారి ఆయన వస్తాడు కాబట్టి, మాట్లాడొచ్చు అని అనుకున్నాను... అని సంపూ తెలిపారు.

ఇంకా పాపులర్ అవుతాననే కారణం కూడా

ఇంకా పాపులర్ అవుతాననే కారణం కూడా

ఈ షో ద్వారా నేను ఇంకా పాపులర్ అయి, ప్రతిఒక్కరికీ తెలుస్తాననేది కూడా ఒక కారణం. షో గురించి వారు చెప్పిన విషయాలు నచ్చి వెంటనే ఒప్పుకున్నాను అని, కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఉండలేక పోయాను అని అర్థమైందని... సంపూ తెలిపారు.

స్టీవెన్ శంకర్ ముందే చెప్పాడు

స్టీవెన్ శంకర్ ముందే చెప్పాడు

బిగ్ బాస్ ఆఫర్ గురించి ‘హృదయ కాలేయం' డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ కు చెప్పాను. ‘‘బిగ్ బాస్'లో నటిస్తే చాలా షరతులు ఉంటాయి. ఫోన్లు ఉండవు, పెన్నూ పేపర్ కూడా ఇవ్వరు. నువ్వేమో, నాలుగైదు రోజుల షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళుతుంటావు. మరి, ‘బిగ్ బాస్'లో అన్ని రోజులు ఉండగలుగుతావా? అని ఆయన ముందే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అపుడు బిగ్ షో అనే ఆనందంలో ఒప్పుకున్నాను అని సంపూ తెలిపారు.

తారక్ అన్నను కలిశాక ఫుల్ హ్యాపీ

తారక్ అన్నను కలిశాక ఫుల్ హ్యాపీ

బిగ్ బాస్ షోలో మొదటి రోజు తారక్ అన్నను కలిసిన తర్వాత ‘బిగ్ బాస్'షోను జయించినంత ఆనందం కలిగింది. ఆ రోజు తారక్ అన్నను కలిసి, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టగానే నాకు టెన్షన్ మొదలైంది.... అని సంపూ తెలిపారు.

ఇంట్లో రోజులు గడిచే కొద్దీ

ఇంట్లో రోజులు గడిచే కొద్దీ

బిగ్ బాస్ ఇంట్లో రోజులు గడిచే కొద్దీ నాకేదో అవుతోంది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ గుర్తొచ్చి.. వాళ్లకు ఏదో అయిపోతున్నట్లు అనిపించింది. అక్కడ ఉండటం నా వల్ల కాలేదు. మెంటల్ గా కాస్ట డిస్ట్రబ్ అయినట్లు అనిపించింది అని సంపూ తెలిపారు.

కల్పన అక్క ప్రేమను

కల్పన అక్క ప్రేమను

బిగ్ బాస్ ఇంట్లో నాకు అంతకు ముందు ఎవరితోనూ స్నేహం లేదు. ధన్ రాజు, ప్రిన్స్, సమీర్ కొంచెం తెలుసు. మరెవ్వరితో నాకు బాగా పరిచయం కూడా లేదు. అక్కడికి వెళ్లిన తర్వాతే అందరూ పరిచయం అయ్యారు. కల్పనక్క నాపై చూపిన ప్రేమను మరిచిపోలేను అని సంపూ తెలిపారు.

షో నుండి బయటకు వచ్చిన తర్వాత

షో నుండి బయటకు వచ్చిన తర్వాత

'బిగ్ బాస్' ఇంటి పరిస్థితులను తట్టుకోలేక తనంతట తానుగా బయటకు వచ్చిన సంపూర్ణేష్ బాబుపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరైతే ఆయన్ను తీవ్రంగా దూషించడం మొదలు పెట్టారు. దీనిపై సంపూ అప్పుడే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘బిగ్ బాస్ ఇంటి నుండి పిరికితనం వల్లో, మరో కారణం చేతనో రాలేదు. నేను బయటకు రావడానికి కారణం "క్లాస్త్రోఫోబియా" అని తెలిపారు. ‘ఇది కేవలం పిరికితనంతో చేసిందిగా భావించి, నేను నటించే నా వృత్తికి లింక్ పెట్టటం చాలా బాధ కలిగింది. దూషణలు నాకు కొత్త కాదు. నటించడం ఈ జన్మకు దొరికిన అదృష్టం. నేనెప్పుడూ సమాజానికి సేవ చేస్తూ మీతో కలిసి వుండాలని కోరుకుంటున్నాను' అని సంపూ వ్యాఖ్యానించారు.

జరిమానా విధించలేదు

జరిమానా విధించలేదు

నా పై ఎప్పటిలాగే ప్రేమ చూపించిన వెబ్ సైట్స్, టీవీ చానెల్స్ వారికి నా నమస్కారాలు. ఒకటి రెండు వెబ్సైట్‌లో రాసినట్టుగా, నాకు లక్షల రూపాయల జరిమానా, ఆత్మహత్య ప్రయత్నం లాంటి వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X