twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడవాళ్లను తిడుతున్నారు, కౌశల్ ఇప్పటికైనా నీ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయ్: సామ్రాట్

    |

    Recommended Video

    Telugu Bigg Boss 2 Contestant Samrat Serious About Kaushal Army

    బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలవడానికి ఆయన అభిమానులు 'కౌశల్ ఆర్మీ'గా ఏర్పడి భారీగా కాంపెయన్ చేయడమే కారణం. అయితే ఈ కౌశల్ ఆర్మీ తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఇతరులను దారుణంగా ట్రోల్ చేయడం, ఆడవారు అని కూడా చూడకుండా వారిపై అసభ్యమైన కామెంట్స్ చేయడం, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలపై బిగ్ బాస్ 2 ఫైనలిస్ట్ సామ్రాట్ స్పందించారు. కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఆడవాళ్లను తిడుతున్నారు

    ఆడవాళ్లను తిడుతున్నారు

    ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. దాని వల్ల అందరూ ఇబ్బందిగా పీలవుతున్నారు. పర్సనల్ లెవల్లో ట్రోలింగ్ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో. మగాళ్లు అయితే లైట్ తీసుకోవచ్చు. ఆడవారి మీద అంత ట్రోలింగ్ చేయడం చాలా దారుణం. దీనిపై చాలా అసంతృప్తిగా ఉన్నాను.... అని సామ్రాట్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    అభిమానం చూపించుకోవడానికి ఇలాంటి పనులేంటి?

    అభిమానం చూపించుకోవడానికి ఇలాంటి పనులేంటి?

    మీరు ఒక వ్యక్తిని డీఫేమ్ చేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్‌లో ఎంటరై అంతా మీకు తెలిసినట్లు తప్పుడుగా మాట్లాడటం బాధాకరమైన విషయం. ట్రోలింగ్ అనేది వేరు... అభిమానం అనేది వేరు. మీ అభిమానం చూపించడానికి వేరే వారిని ట్రోల్ చేసి చూపడం సరైంది కాదని నా ఫీలింగ్... అని సామ్రాట్ అన్నారు.

     నాపై కూడా ట్రోల్ చేశారు

    నాపై కూడా ట్రోల్ చేశారు

    నాపైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. కానీ పూర్తిగా చూడలేదు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. జనరల్‌గా ట్రోల్ చేస్తే ఓకే... వ్యక్తిగత విషయాలతో వారు ప్రొఫెషనల్‌గా కూడా ఇబ్బందికి గురయ్యేలా ట్రోలింగ్ చేయడం సరికాదు.

    అందరికీ చాలా డ్యామేజ్ జరిగింది

    అందరికీ చాలా డ్యామేజ్ జరిగింది

    ఇన్ హౌస్ గేమ్ అయితే చాలా స్పోర్టివ్‌గా నడిచింది. బయట జరుగుతున్నదాని గురించి బయటకు వచ్చాకే తెలిసింది. ఇంట్లో ఉండి బయట ట్రోలింగ్ అయితే ఆపలేం. అందరికీ చాలా పెద్ద డ్యామేజ్ అయింది. బిగ్ బాస్ ఇంట్లో అందరం గేమ్‌ను గేమ్ లా ఆడాము.

     నాని అన్న మీద కక్ష పెంచుకన్నారు

    నాని అన్న మీద కక్ష పెంచుకన్నారు

    నాని అన్న మీద కూడా ట్రోలింగ్ జరిగింది. ఆయన సినిమాకు అడ్డంకి కలిగించే స్థాయిలో కక్ష పెంచుకోవడం మరీ దారుణం. బిగ్ బాస్ 1 సీజన్తో పోలిస్తే బిగ్ బాస్ 2లో పరిస్థితి భిన్నంగా ఉన్న మాట వాస్తవం... అని సామ్రాట్ అన్నారు.

    కౌశల్ ఇప్పటికైనా ఆ ట్రోలింగ్ ఆపించు

    కౌశల్ ఇప్పటికైనా ఆ ట్రోలింగ్ ఆపించు

    బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌కు ఉన్న అభిమానులను చూసి ఆశ్చర్య పోయాను. అభిమానం అనేది అందరికీ ముఖ్యమే. 20 ఏళ్లుగా కౌశల్ కష్టపడుతున్నాడు. నేను కూడా 11 సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. నీకు అంత అభిమానం, అభిమానులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాణేనికి మరో వైపు కూడా చూడు. ఎందుకంటే అభిమానం పేరుతో మన సొంత ఇంట్లో మనతో పాటు ఉన్న వారిని చాలా అవమానిస్తున్నారు. గేమ్ అయిపోయింది. నీకు టైటిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ అభిమానంతో నీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఆ ట్రోల్స్ చేస్తున్నారో దాన్ని ఆపించు. ఇదీ నీకు నా హంబుల్ రిక్వెస్ట్...అంటూ కైశల్‌కు సామ్రాట్ సూచించారు.

    English summary
    Telugu Bigg Boss 2 contestant Samrat serious about the trolling by Kaushal Army, of other contestants in the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X