ముద్దొస్తే కిస్ పెడతా.. తేజస్వితో ఎఫైర్ గురించి సామ్రాట్.. నాని అన్నకు తనీష్ బలయ్యాడు!

దాదాపు నాలుగు నెలలు తెలుగు ప్రేక్షకులని బిగ్ బాస్ షో అలరించింది. కౌశల్ విజేతగా నిలిచాడు. ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ ని వదలి వెళ్లారు. బయటకు వచ్చిన ఇంటిసభ్యులంతా పలు ఇంటర్వ్యూలలో తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 తొలి ఫైనలిస్ట్ సామ్రాట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించాడు. తేజస్వితో తాను క్లోజ్ గా ఉండడంపై క్లారిటీ ఇచ్చాడు.

 తేజస్వీతో ఎఫైర్

తేజస్వీతో ఎఫైర్


తేజస్వితో ఎఫైర్ గురించి సామ్రాట్ మాట్లాడుతూ.. తాను హౌస్ లో తనీష్ తో ఎంత సన్నిహితంగా ఉన్నానో తేజతో కూడా అలాగే ఉన్నానని సామ్రాట్ తెలిపాడు. తేజు అమ్మాయి కాబట్టి మా స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చని సామ్రాట్ క్లారిటీ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Tejaswi Gets Comments From Kaushal Army
ముద్దొస్తే కిస్ పెడతా

ముద్దొస్తే కిస్ పెడతా


తాను తనీష్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. హగ్ చేసుకునేవాడిని. ముద్దొస్తే కిస్ చేసేవాడిని. అదే పని తేజతో చేస్తే అమ్మాయి కాబట్టి ఇలా అర్థం చేసున్నారని సామ్రాట్ అభిప్రాయపడ్డాడు. తేజుపై, నాపై నాని అన్న మొదట్లో జోకులు వేస్తుంటే అర్థం అయ్యేది కాదు. ఆ తరువాత తెలిసింది జనాలు ఈ విధంగా అనుకోడం వల్లే నాని అన్న ఇంకేటి.. ఇంకేటి అంటూ ఆటపట్టించారు.

 బిగ్ బాస్‌లోకి వచ్చే పరిస్థితి లేదు

బిగ్ బాస్‌లోకి వచ్చే పరిస్థితి లేదు

కుటుంబ సమస్యలతో, నాన్నకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చిందని సామ్రాట్ తెలిపాడు. మొదట్లో నాన్న ఆరోగ్యం చూసి రాకూడని అనుకున్నా. కానీ నాన్నే తనని ప్రోత్సహించారని సామ్రాట్ తెలిపాడు.

శ్యామల అలా అనుకున్నారు

శ్యామల అలా అనుకున్నారు

బిగ్ బాస్ లోకి సామ్రాట్ ని ఎందుకు తీసుకుని వచ్చారు అని అనుకున్న వారు కూడా ఉన్నారు. శ్యామల గారు తన గురించి అలా అనుకున్నారని తెలిపాడు. సామ్రాట్ అలా కదా.. ఇలా కదా .. ఈయనేందుకు వచ్చాడు అని శ్యామల గారు మొదట్లో భావించారని సామ్రాట్ తెలిపాడు.

 కౌశల్ అంటే ఇష్టమే

కౌశల్ అంటే ఇష్టమే

కౌశల్ పై తనకు మంచి అభిప్రాయమే ఉందని సామ్రాట్ తెలిపాడు. ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు. నేను సోఫాలో కూర్చుని తింటుంటే అడ్డుకున్నారు. ఆయనే చెప్పింది సరైనదిగా అనిపించింది అని సామ్రాట్ తెలిపాడు. కానీ కుక్క అని పిలిచినప్పుడు మాత్రం చాలా బాదపడ్డా.

 నాని అన్నతో చాలా ఫన్

నాని అన్నతో చాలా ఫన్

నాని అన్న హోస్టింగ్ చాలా సరదాగా అనిపించింది. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్ లో అందరిని కడిగిపారేశారు. నాని అన్నకు ఎక్కువగా బలైంది తనీషే అని సామ్రాట్ తెలిపాడు. హలో అని సరదగా చెబితే నాని అన్న ప్రశాంతంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆలా లేకుంటే ఆరోజు ఎవరికో మూడిందని హౌస్ మేట్స్ భావించేవాళ్లు.

 గీత మాధురే విన్నర్

గీత మాధురే విన్నర్

తాను ఫైనల్ చేరినప్పుడే టైటిల్ గెలిచినంత సంతోషపడ్డానని సామ్రాట్ తెలిపాడు. తన దృష్టిలోమాత్రం గీతా మాధురే బిగ్ బాస్ విజేత అని సామ్రాట్ తెలిపాడు. కౌశల్ గెలిచినందుకు కూడా సంతోషంగా ఉందని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X