సమ్రాట్, గీతా మాధురి కెమిస్ట్రీ అదిరింది.. అర్ధరాత్రి రొమాంటిక్‌గా!

By Rajababu

బిగ్‌బాస్‌లో సరికొత్త రొమాంటిక్ జోడి కనిపించబోతున్నదా? గతంలో తేజస్వి మదివాడతో హాట్‌హాట్‌గా సమ్రాట్ కెమిస్ట్రీని పండించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతా మాధురితో కొత్త రిలేషన్‌కు తెరతీయబోతున్నట్టు సిగ్నల్ కనిపిస్తున్నాయి. 66వ రోజు ఎపిసోడ్‌లో గీతా మాధురి, సామ్రాట్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారిద్దరి హావభావాలు మరో రొమాంటిక్ ఎపిసోడ్‌కు తెరతీయబోతున్నట్టు అనిపిస్తున్నది.

వింత వింతగా సామ్రాట్, గీతా

వింత వింతగా సామ్రాట్, గీతా

బుధవారం రోజున బిగ్‌బాస్ కాల్ సెంటర్ టాస్క్ కొనసాగింది. కాల్ సెంటర్ ఉద్యోగులు నటించిన వారు.. కాలర్స్‌గా అవతారం ఎత్తారు. అలాగే ఉద్యోగులుగా నటించిన వారు కాలర్స్‌గా మారారు. ఈ టాస్క్ సమయంలోనే గీతా మాధురి, సమ్రాట్ మధ్య వింత వింతగా ప్రవర్తించారు.

Recommended Video

Bigg Boss 2 Telugu 67 Day Highlights : Call Center Task Went With A Great Interest
కనుసైగలతోనే మాటలు

కనుసైగలతోనే మాటలు

కాల్ సెంటర్ చాంబర్‌లో గీతా మాధురి కూర్చొని ఉండగా, ఎదురుగా కూర్చొని ఉన్న సమాట్ర్ మధ్య సైగల పర్వం సాగింది. గీతా మాధురి ఎలాంటి ఫోజ్ పెడితే సమ్రాట్ అలా.. అలాగే ఆమె ఎలా బిహేవ్ చేస్తే సమ్రాట్ అలానే సైగలు చేస్తూ ప్రేక్షకులకు లేనిపోని అనుమానాలు కలుగజేశారు.

సీన్ బిల్డప్ ఇలా

సీన్ బిల్డప్ ఇలా

సామ్రాట్, గీతా మాధురి ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తుండగా ‘కళ్లు కళ్లు చూడు. వాళ్లు వీళ్లు మైనస్' అనే పాటను ప్లే చేయడంతో వారి మధ్య ఏదో ఒకటి జరుగుతుందనే విధంగా సీన్ బిల్డప్ అయింది. ప్రేక్షకులకు వారి చేష్టలపై ఏదో జరుగబోతుందనే ఫీలింగ్ కలిగింది.

ఒకరికొకరు చేతులు పట్టుకొని

ఒకరికొకరు చేతులు పట్టుకొని

అలాగే గీతా మాధురి, సామ్రాట్ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని గుంజుకొంటూ ఒక ఆట ఆడారు. ఈ ఆటలో సమ్రాట్ ఎక్కువ సార్లు గెలిచాడు. దాంతో వారి మధ్య గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త బంధం కనిపించింది.

అర్ధరాత్రి రొమాంటిక్‌గా

అర్ధరాత్రి రొమాంటిక్‌గా

బిగ్‌బాస్ హౌస్‌లో లైట్లు ఆర్పిన తర్వాత తలనొప్పితో బాధపడపడుతున్న సామ్రాట్‌కు గణేష్ మర్ధన చేశాడు. ఆ సమయంలో గీత మాధురి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో ఏం ఫర్వాలేదు. హాయిగా పడుకోండి అంటూ ముద్దు ముద్దుగా మాటలు చెప్పింది. దాంతో బెడ్‌పై కూర్చొమన్నాడు. అప్పుడు లేదు.. రేపు మనం ఆడుకొందామని గీత మాధురి చెప్పింది.

పెంటపెట్టడం ఖాయమని

పెంటపెట్టడం ఖాయమని

ఇంట్లో సభ్యులందరూ నిద్రిస్తుండగా అమిత్, సామ్రాట్, గీతా మాధురి మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇంట్లో గీత ఏది చేసినా ఏం పట్టించుకోరు అని అమిత్ అంటే పెంట పెట్టడం ఖాయం అని గీతా అన్నారు.

రెండు నెలల్లో కలిసిపోతామా?

రెండు నెలల్లో కలిసిపోతామా?

ఇంట్లో మనమంత కళ్లతోనే మాట్లాడుకొంటున్నాం. చిన్నగా నవ్వుకొంటున్నాం అని గీతా మాధురి చెప్పింది. రెండు నెలలు కలిసి ఉంటే ఒకరికొకరు కలిసిపోతామా? కళ్లతో కొంత వరకు మాట్లాడుకోవడం జరుగుతుంది అని గీతా గుసగుసలాడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X