బిగ్‌బాస్‌కు మరో లీక్ దెబ్బ.. ఈ వారం అవుటయ్యేది ఎవరో తెలుసా?

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Elimination Process Leaked

బిగ్‌బాస్ హౌస్‌లో లీకులు పర్వం యదేచ్ఛగా సాగుతున్నది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమాచారం మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందేసి ఈ వారం ఎవరు బలహీనమైన అభ్యర్థి, ఎవరు అవుట్ కానున్నారనే విషయాన్ని వెల్లడించే ఓ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చాలా పకడ్బందీగా, సీక్రెట్‌గా కొనసాగే ఈ రియాలిటీ షో నిబంధనలకు విరుద్ధంగా ముందే బజారున పడటం స్టార్ మా నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.

ఐదోవారం నామినేషన్

ఐదోవారం నామినేషన్

ఐదోవారంలో పేరున్న సెలబ్రిటీలే నామినేట్ కావడంతో షో మరింత ఆసక్తిగా మారింది. దీప్తి నల్లమోతు, రోల్ రైడా, సమ్రాట్ రెడ్డి, తనీష్ అల్లాడి, తేజస్వి మదివాడ నామినేషన్ లిస్టులో ఉన్నారు. వీరిలో ఒకరు తప్పనిసరిగా ఎలిమినేట్ కావాల్సి ఉంది.

సామ్రాట్‌కు తక్కువ ఓట్లు

సామ్రాట్‌కు తక్కువ ఓట్లు

లీక్ అయిన డాక్యుమెంట్ ప్రకారం ఇప్పటికే నామినేషన్‌లో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఓటింగ్ వివరాలు తాజాగా వెలుగు చూశాయి. దీప్తి నల్లమోతుకు 19470636, రోల్ రైడాకు 2044181 ఓట్లు, సామ్రాట్ రెడ్డికి 355937 ఓట్లు, తనీష్ అల్లాడికి 1047163 ఓట్లు, తేజస్వి 1479371 ఓట్లు పోలయ్యా. ఇప్పటి వరకు పోలైన ఓట్లను బట్టి చూస్తే డేంజర్ జోన్‌లో సామ్రాట్ రెడ్డి ఉన్నారు.

బిగ్‌బాస్‌కు పెద్ద దెబ్బే

బిగ్‌బాస్‌కు పెద్ద దెబ్బే

ఒకవేళ లీకైన డాక్యుమెంట్ ప్రకారం సమ్రాట్ రెడ్డి ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ షోకు పెద్ద దెబ్బే. కాస్తో కూస్తో తేజస్వితో కలిసి షోను సమ్రాట్ కొంత క్రేజ్ తెప్పించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సామ్రాట్ బయటకు వెళితే కొంత గ్లామర్ తగ్గే అవకాశం ఉండే పరిస్థితి ఉంది.

సామ్రాట్‌కు ఓట్లు పడితే

సామ్రాట్‌కు ఓట్లు పడితే

బిగ్‌బాస్ ఎలిమినేషన్‌కు సంబంధించిన ఓటింగ్‌కు ఇంకా శుక్రవారం వరకు గడువు ఉంది. ఒకవేళ అప్పటికి సామ్రాట్‌కు ఓట్లు దండిగా వస్తే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎవరు బయటకు వెళ్తారనే అంశంపై సస్పెన్స్ పెరిగే అవకాశం ఉంది.

లీకులు స్టార్ మా పనేనా?

లీకులు స్టార్ మా పనేనా?

బిగ్‌బాస్‌లో తేజస్వితో తిరగడం తప్ప సమ్రాట్‌కు పెద్ద పనిలేదనే అభిప్రాయం ఉంది. అందుకు ఆ రకంగా తక్కువ ఓట్లు వచ్చాయనుకొందాం. సమ్రాట్‌ను రక్షించడానికి స్టార్ మా నిర్వాహకులే ఈ డాక్యుమెంట్ లీక్ చేశారా? లీక్ చేయడం ద్వారా సమ్రాట్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బిగ్‌బాస్ ప్రతిష్టపై మరక

బిగ్‌బాస్ ప్రతిష్టపై మరక

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ మా డాక్యుమెంట్ నిజమేనా? లేక ఎవరైనా కావాలనే సృష్టించి హల్‌చల్ చేస్తున్నారా? అనేది బిగ్‌బాస్ నిర్వాహకులు నోరు విప్పితే తప్ప అసలు విషయం బయటపడదు. ఏది ఏమైనా, గతంలో మునుపెన్నడూ లేని విధంగా బిగ్‌బాస్‌లో యదేచ్ఛగా లీకులు కావడం ఎంతైనా షో ప్రతిష్ట మసకబారే అంశమే.

ఇంటిలోకి హెబ్బా పటేల్

ఇంటిలోకి హెబ్బా పటేల్

ఇదిలా ఉండగా, సామ్రాట్ బయటకు వెళ్లినా.. మరోకరు వెళ్లినా వారి స్థానంలో హెబ్బా పటేల్ ఇంటిలోకి వెళ్తుందనే గాసిప్‌ కూడా వైరల్ అవుతున్నది. ఒకవేళ హెబ్బా పటేల్ వస్తే షో మరింత గ్లామర్‌గా ఉండే అవకాశం కూడా లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X