కౌశల్, పూజ ఫైట్.. దీప్తిని గోకిన తనీష్.. ఇంట్లో గొడవలు.. భోరున ఏడ్చిన శ్యామల!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 59 Highlights

బిగ్‌బాస్‌లో 58వ రోజు ఇంటి సభ్యుల మధ్య పోరు రంజుగా సాగింది. బిగ్‌బాస్ విధించిన టాస్క్‌లో భాగంగా ఆడ, మగ సభ్యుల మధ్య అధిపత్య పోరు ఆసక్తికరంగా సాగింది. కిచెన్‌లో ఇంటి సభ్యుల ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకొని ఎంజాయ్ చేశారు. ఇంకా ఇంటిలో ఏమి జరిగాయంటే..

కిచెన్‌లో వంట చేసిన దీప్తి సునైనా

కిచెన్‌లో వంట చేసిన దీప్తి సునైనా

కిచెన్‌లో గీతా మాధురితోపాటు దీప్తి సునైనా వంటపనులు చేసింది. దోశలు, అమ్మేట్లు వేసింది. వాటిని తింటూ సామ్రాట్, తనీష్ ఇద్దరు దీప్తి సునైనాను ఆటపట్టించారు. వారు కామెంట్ చేస్తుండగా దీప్తి సునైనా చిరునవ్వులు చిందిస్తూ ఆనందించింది.

సమంతలా ఉంది కదా..

సమంతలా ఉంది కదా..

దీప్తి సునైనాన ఉద్దేశించి సమంతలా ఉంది కదా అంటూ సామ్రాట్ ఆటపట్టించారు. అయితే ఆమె మేకప్ లేని సమంత అంటూ దీప్తి సునైనా తనీష్ కామెంట్ చేశారు. ఆయనను పట్టించుకోవడం లేదు.. నేను ఎప్పుడో వదిలేశాను అని దీప్తి సునైనా కామెంట్ చేశారు.

బిగ్‌బాస్ ఆధిపత్యపోరు టాస్క్

బిగ్‌బాస్ ఆధిపత్యపోరు టాస్క్

ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ విధించాడు. తరతరాలుగా ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నది. ఈ హౌస్‌లో మహిళలు, పురుషులకు మధ్య ఆధిపత్యం సాధించే పోరు జరుగుతుంది. ఇంటిలోని రెండు ప్రాంతాల్లోని ఒకరి ప్రదేశంపై మరోకరు అధిపత్యం సాధించాలి. అందుకు ఇంటి సభ్యులకు ఇచ్చిన కొంత డబ్బును గెలిచిన వారికి ఇవ్వాలి అని సూచించాడు.

భోరున ఏడ్చిన శ్యామల

భోరున ఏడ్చిన శ్యామల

ఇంట్లోని వస్తువులను గెలుచుకోవడానికి భుజ బాలన్ని ఇంటి సభ్యులు చూపించారు. బాత్రూంలో ఉన్న ఇంటి సభ్యుడి వద్ద వస్తువును తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో యాంకర్ శ్యామల డోర్ మధ్యన నలిగిపోయింది. బాత్రూంలోకి వెళ్లిన శ్యామలను బంధించారు. దాంతో నాకు చీకటి అంటూ భోరున ఏడ్చింది.

కౌశల్, పూజాకు మధ్య గొడవ

కౌశల్, పూజాకు మధ్య గొడవ

పురుషులు, మహిళల అధిపత్యపోరు టాస్క్‌లో కౌశల్, పూజా రాంచంద్రన్‌కు మధ్య గొడవ చోటుచేసుకొన్నది. ఓ దశలో వారి మధ్య మాటలు తీవ్రస్థాయిలోకి వెళ్లాయి. నీవు నాకు చెప్పనవసరం లేదని పూజా ఆవేశంతో అరిచింది.

అమిత్, గీతా మాధురి, శ్యామల ఫీట్లు

అమిత్, గీతా మాధురి, శ్యామల ఫీట్లు

మగ ఇంటి సభ్యుల వద్ద ఉన్న కాయిన్స్‌ను లాక్కోవడానికి గీతా మాధురి, పూజా, శ్యామల తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో వాగ్వాదం జరిగింది. కిందపడిపోయారు. అంతా గంగరగోళం చోటుచేసుకొన్నది.

శ్యామలను ఆటపట్టించిన అమిత్

శ్యామలను ఆటపట్టించిన అమిత్

ఇంటిలో జరిగిన ఆధిపత్యపోరులో శ్యామలను అమిత్ అమాంతం లేపి ఆటపట్టించారు. బాత్రూంకు పోకుండా ఆపడం సరికాదు. ఆడపిల్లను ఏడ్పిస్తే ఇళ్లు నాశనం అయిపోతుంది అంటూ శ్యామల శాపనర్థాలు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X