సామ్రాట్, తేజస్విలో ఒకరు మటాష్.. తృటిలో తప్పించుకొన్న తనీష్.. నిజం కాబోతున్న బిగ్‌బాస్‌లో లీక్!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ప్రతీవారం మాదిరిగా కాకుండా 40వ రోజు చాలా ఆహ్లాదకరంగా గడిచిపోయింది. గతవారం బ్లాక్‌బాస్టర్ టాస్క్ గురించి నాని మాట్లాడుతూ ఇంటి సభ్యులను ఉత్సాహపరిచారు. బ్లాక్‌బస్టర్ సినిమాలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని అభినందిస్తూ కొందరికి చురకలు కూడా అంటించారు. అంతేకాకుండా స్వయంగా కొంత వినోదాన్ని పంచాడు. నామినేట్ అయిన ఐదుగురిలో ముగ్గురిని ప్రొటెక్టెడ్ జోన్‌కు పంపించడం శనివారం ఎపిసోడ్‌లో విశేషంగా మారింది.

ఎలిమినేషన్‌పైనే చర్చ

ఎలిమినేషన్‌పైనే చర్చ

శనివారం ఎలిమినేషన్ ప్రక్రియ కీలకం కావడంతో సభ్యులందరిలోనూ దానిపై చర్చ జరిగింది. తేజస్వి, సామ్రాట్ తమ తమ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకొన్నారు.

బిగ్‌బాస్‌కు నేనెందుకు వచ్చానంటే

బిగ్‌బాస్‌కు నేనెందుకు వచ్చానంటే

ఇంట్లో అర్ధరాత్రి లైట్లు ఆర్పిన తర్వాత కూడా ఎలిమినేషన్ చర్చ కొనసాగింది. ఎలిమినేషన్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చామో తెలిపారు. తేజస్విని 50 లక్షలు సంపాదించాలన్న ఉద్దేశంతోనే వచ్చానని చెప్పింది. రోల్‌రైడా మాత్రం తెలుగులో ర్యాప్ సింగర్ ఉన్నారని చెప్పడానికి వచ్చాను. నా నుంచి పిల్లలు స్ఫూర్తి పొందితే అదే నాకు ఆనందం అని చెప్పాడు.

చేదు అనుభవాన్ని మరిచేందుకే

చేదు అనుభవాన్ని మరిచేందుకే

సామ్రాట్ తన గురించి చెబుతూ నా జీవితంలో ఇటీవల చోటుచేసుకొన్న చేదు అనుభవాన్ని మరిచిపోవడానికి వచ్చాను. నాపై ఉన్న బ్యాడ్ ఇమేజ్‌ను తొలగించుకోవాలన్న ఉద్ధేశం కూడా ఉందని చెప్పారు. నాకు బయటకు వెళ్లినా పెద్దగా బాధపడను అని సామ్రాట్ చెప్పారు.

గణేష్‌కు నాని చురకలు

గణేష్‌కు నాని చురకలు

గతవారం టాస్క్ సందర్భంగా అమిత్ గుడ్డు కొట్టిన వ్యవహారాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దని గణేష్‌కు చురకలు అంటించాడు. ఏదో చిన్న విషయానికి గేట్లు తీయండి బయటకు వెళ్లిపోతాను అని కోపంతో అరిచిన గణేష్‌కు షాకిచ్చాడు. నేను ఇప్పుడు గేట్లు తీయిస్తా బయటకు వెళ్లు అని గణేష్‌కు నాని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఏదో ఒక మూడ్‌లో ఉన్నానని గణేష్ సర్దిచెప్పుకొన్నాడు.

రోల్‌రైడా ప్రొటెక్టెడ్

రోల్‌రైడా ప్రొటెక్టెడ్

నాని ఇలా ఎపిసోడ్‌ను కొనసాగిస్తూనే ఎలిమినేషన్ ప్రక్రియను తెరపైకి తెచ్చాడు. తొలుత ఐదుగురు ఎలిమినేషన్‌లో ఉండగా, వారి నుంచి రోల్ రైడాను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించాడు. దాంతో ఇక నలుగురిలో టెన్షన్ పెరిగింది.

సామ్రాట్, తేజస్విలో ఆందోళన

సామ్రాట్, తేజస్విలో ఆందోళన

ఎలిమినేషన్‌లో ఉన్న సామ్రాట్, దీప్తి, తేజస్వి, తనీష్‌ ముఖాల్లో ఆందోళన పెరిగింది. ఆ నలుగురిలో నుంచి దీప్తి నల్లమోతును మళ్లీ ప్రొటెక్షన్ జోన్‌లోకి పంపించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పక్కనే ఉన్న అందరినీ కౌగిలించుకొని తన సంతోషాన్ని పంచుకొన్నారు.

తనీష్ ప్రొటెక్టెడ్ ఇలా

తనీష్ ప్రొటెక్టెడ్ ఇలా

రోల్ రైడా, దీప్తి ఎలిమినేషన్‌ నుంచి బయటపడిన తర్వాత తేజస్వి, సామ్రాట్, తనీష్‌లో మరింత ఆందోళన పెరిగింది. అయితే ఆ టెన్షన్‌ నుంచి తనీష్‌ను సేఫ్ చేసి నాని.. తేజస్వి, సామ్రాట్‌ నిజంగా షాక్ గురిచేశారు. ఇంటిలో ఎప్పుడూ అధిక్యాన్ని ప్రదర్శించే ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లడం ఖాయమైనట్టు స్పష్టమైంది.

డేంజర్ జోన్‌లో తేజస్వి, సామ్రాట్

డేంజర్ జోన్‌లో తేజస్వి, సామ్రాట్

బిగ్‌బాస్‌లో ఆదివారం జరిగే ఎపిసోడ్ చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు లీడింగ్‌లో ఉన్న తేజస్వి, సామ్రాట్ బయటకు వెళ్తారా? లేక బిగ్‌బాస్ మరేదైనా ట్విస్ట్ ఇస్తారా అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలైంది. సామ్రాట్, తేజస్విలో ఎవరినైనా ఒకరిని గత సీజన్‌లో ముమైత్‌ను ప్రత్యేకమైన గదిలో పెట్టినట్టు పెడుతారా? అనే సందేహం కూడా వ్యక్తమవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X