తేజస్వి క్యారెక్టర్ అలాంటిది.. నన్ను చాలా ఇరిటేట్ చేసింది.. సామ్రాట్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో సామ్రాట్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే ట్యాగ్‌ను సంపాదించుకొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనడానికి ముందు తనపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు సామ్రాట్ సిద్ధమయ్యాడు. తనదైన స్టయిల్‌లో గేమ్‌ను ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తన వ్యక్తిగత అనుభవాలను ఇటీవల మీడియాకు వెల్లడించారు. సామ్రాట్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

కౌశల్ బలం తెలియలేదు

కౌశల్ బలం తెలియలేదు

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కౌశల్ బలం ఏమిటో తెలియలేదు. ఫైనల్ అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి షాక్ తిన్నాం. ఇంట్లో మొదటి రోజు నుంచి చాలా డిసిప్లేన్‌గా ఉన్నాడు అని సామ్రాట్ పేర్కొన్నాడు.

Recommended Video

Telugu Bigg Boss 2 Contestant Samrat Serious About Kaushal Army
కౌశల్‌ను చూసి నేర్చుకొన్నా

కౌశల్‌ను చూసి నేర్చుకొన్నా

ఇంట్లో కౌశల్‌ను చూసి చాలా నేర్చుకొన్నాను. డైనింగ్ టేబుల్ వద్ద జరిగిన గొడవలో కౌశల్ తీరు సమంజసమే. కౌశల్‌ను చూసి మైక్ సరిగ్గా చూసుకోవడం, నిద్ర పోకుండా ఉండటం విషయంలో జాగ్రత్త పడ్డాను. కౌశల్‌ బిగ్‌బాస్ ట్రోఫి గెలుచుకోవడం ఆనందంగా ఉంది అని సామ్రాట్ అన్నాడు.

కౌశల్ మాటలు నన్ను బాధపెట్టాయి

కౌశల్ మాటలు నన్ను బాధపెట్టాయి

కుక్కల్లా ఎగబడుతున్నారేంటి అని కౌశల్ చేసిన కామెంట్‌ను నేను జీర్ణించుకోలేకపోయాను. అందుకే అతడిపై అరిచాను. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. దాంతో ఆయనతో గొడవకు దిగాను. కౌశల్ అలా కామెంట్ చేయకుండా ఉండాల్సింది అని సామ్రాట్ అభిప్రాయపడ్డారు.

తేజస్వి బాగా ఇరిటేట్..

తేజస్వి బాగా ఇరిటేట్..

బిగ్‌బాస్ హౌస్‌లో తేజస్వి నన్ను చాలా ఇరిటేట్‌కు గురి చేసింది. టామ్ బాయ్ క్యారెక్టర్ ఆమెది. తేజస్వి, నాకు లింక్ పెట్టడం వెనుక ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. తనీస్ నాకు మధ్య ఉన్న రిలేషన్ లాంటిదే తేజస్వినితో ఉంది అని సామ్రాట్ స్పష్టం చేశాడు.

బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు

బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు

బిగ్‌బాస్ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే స్వచ్ఛంద సేవ చేయాలని అనుకొంటున్నాను. అలాగే ఎదైనా అవకాశం వస్తే టీవీ షోను హోస్ట్ చేయాలనుకొంటున్నాను అని సామ్రాట్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X