ఆమెను వదులుకోవడం తప్పు.. నాన్న తాగి కొట్టాడు.. క్యాన్సర్‌తో అమ్మ.. సామ్రాట్, తేజస్వి, కౌశల్ కంటతడి

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 30 Highlights...Nomination Special

బిగ్‌బాస్2 అంతగా ఆకట్టుకోలేకపోతుందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రియాలిటీ షోను ఆసక్తికరంగా మలిచేందుకు నిర్వాహకులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. లగ్జరీ టాస్క్ బడ్జెట్‌లో భాగంగా మంచి చెడు గేమ్‌ను ఆడాలని ఇంటి సభ్యులకు సూచించాడు. అలాగే తన జీవితంలో ఎవరికైనా అన్యాయం చేసినట్టు ఫీలింగ్ ఉంటే బిగ్‌బాస్ వేదికగా సారీ చెప్పాలని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్స్‌లోకి వెళితే..

ఇంటి సభ్యులను రెండు భాగాలుగా

ఇంటి సభ్యులను రెండు భాగాలుగా

మంచి, చెడు గేమ్ ఆడటం కోసం ఇంటి సభ్యులను రెండు భాగాలు విభజించాడు. తేజస్విని, సామ్రాట్, గణేష్, గీతా మాధురి, అమిత్‌తో కూడిన జట్టుకు చెడు జట్టుగా విభజించి వారు నల్లటి దుస్తులు ధరించాలని సూచించాడు. అలాగే తనీష్, సునైనా, రోల్ రైడా, బాబు గోగినేని ఉన్న జట్టును మంచి టీంగా విభజించి, తెల్లటి దుస్తులు ధరించాలని బిగ్‌బాస్ చెప్పారు.

మూడు తామర పువ్వులను..

మూడు తామర పువ్వులను..

టాస్క్‌లో భాగంగా మూడు తామర పువ్వులను చెడు జట్టు నాశనం చేయాలి. అలాగే మంచి టీమ్ ఇంటిని శుభ్రం చేస్తే దానిని కూడా నాశనం చేయాలి. ఇలా రెండు జట్లలో ఒకరు బాగు చేస్తే మరొకరు ఇంటిని గందరగోళంగా మార్చారు. మూడు తామర పువ్వులను ఎలాంటి కష్టం లేకుండా చెడు టీమ్ నాశనం చేయడం జరిగింది.

ప్రియురాలికి బ్రేకప్ ఇలా

ప్రియురాలికి బ్రేకప్ ఇలా

ఇక మంచి, చెడు టాస్క్ నిరాశజనకంగా సాగడంతో ఆటలో భావోద్వేగాన్ని నింపాడు బిగ్‌బాస్. తన జీవితంలో ఎవరైనా తప్పు చేశామని భావిస్తే అందుకు క్షమాపణ చెప్పుకోమనగా.. సామ్రాట్ ముందుకొచ్చాడు. తన జీవితంలో నాలుగేళ్లపాటు నడిపించిన ఓ అఫైర్ ఉండేది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడంతో పెళ్లి పీటల దాకా వచ్చింది. చివరి నిమిషాల్లో ఏదో గ్యాప్ వల్ల నేను మూర్ఖంగా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పాను. ఆ తర్వాత తెలిసింది నా బ్రేకప్ కారణం. అప్పటికే చేతిలో నుంచి ఆ అవకాశం జారిపోయింది. ఆమెకు నేను క్షమాపణ చెప్పలేకపోయాను. ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఈ సందర్బంగా నేను ఆమెకు సారీ చెబుతున్నాను. ఎవరైనా ప్రేమిస్తే తుది శ్వాస విడిచేదాకా వారి చేతిని వదిలేయవద్దు అని సామ్రాట్ కోరాడు.

నాన్న తాగి కొట్టేవాడు

నాన్న తాగి కొట్టేవాడు

తేజస్వి తన బాల్యంలో జరిగిన కన్నీటి గాథను చెప్పింది. చిన్నతనంలో నా తల్లి క్యాన్సర్‌తో చనిపోయింది. నేను, మా అన్న, నాన్న ఉండేవాళ్లం. మమ్మల్ని సరిగా పట్టించుకునే వాడు కాదు. అన్నయ్య తన దారి తాను చూసుకొన్నాడు. నాన్న తాగి వచ్చి నన్ను చాలాసార్లు కొట్టాడు. ఆ సమయంలో 18 ఏళ్ల తర్వాత ఇంటి నుంచి పారిపోవాలనుకొన్నాను. అలాగే మా నాన్నను వదిలేసి వచ్చాను. కానీ మా నాన్నను వదిలి తప్పు చేశానని అనిపిస్తున్నది. అందుకు సారీ. తిరిగి మా నాన్న జాగ్రత్తగా చూసుకొంటాను అని తేజస్వి చెప్పింది.

మా అమ్మ క్యాన్సర్‌తో మరణం

మా అమ్మ క్యాన్సర్‌తో మరణం

నేను సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం, స్థిరపడేందుకు ప్రయత్నించే రోజులు. ఆ సమయంలో వైజాగ్‌లో మా అమ్మ క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు. ఆ సమయంలో షూటింగ్‌లతో బిజీగా ఉండి అమ్మను పట్టించుకోలేకపోయాను. శ్రీరామ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడాను. ఆ తర్వాత కొద్ది సేపటికే మా అమ్మ చనిపోయారని కాల్ వచ్చింది. చివరి రోజుల్లో తనతో ఉండలేకపోయానని నాకు ఇప్పటికి బాధ వెంటాడుతుంది. ఈ సందర్బంగా అమ్మకు సారీ చెబుతున్నాను అని కౌశల్ చెప్పాడు.

భానుశ్రీకి అమిత్ సారీ

భానుశ్రీకి అమిత్ సారీ

టెలిఫోన్ నామినేషన్ ప్రక్రియలో భానుశ్రీని కాపాడలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. నా మైండ్ సరిగా పనిచేయదు. నా హార్ట్ చాలా వీక్. అందుకే నిర్ణయాలు సరిగా తీసుకోలేను. నా సిస్టర్ కంటే ఎక్కువగా భావించే భాను శ్రీకి మాట ఇచ్చి తప్పాను. అప్పటి నుంచి నేను బాధ పడుతున్నాను. ఈ సందర్బంగా భాను శ్రీకి సారీ చెబుతున్నాను అని ఓ తెల్ల గులాబీ ఇచ్చాడు. దాంతో భానుశ్రీ కూల్ అయిపోయింది.

కిందపడిపోయినట్టు భానుశ్రీ యాక్టింగ్

కిందపడిపోయినట్టు భానుశ్రీ యాక్టింగ్

మంచి, చెడు టాస్క్‌లో రెండు జట్ల మధ్య కొంత గలాటా జరిగింది. చెడు టీమ్‌ను మంచి టీమ్ ఇంట్లో బంధించారు. బ్యాటరీలు మార్చుకోవాలని బిగ్‌బాస్ చేసిన హెచ్చరికలను మంచి టీమ్ పెడచెవిన పెట్టారు. దాంతో భాను శ్రీ కింద పడిపోయినట్టు నటించింది. దాంతో అందరు కంగారు పడ్డారు. డోర్ తీయగానే చెడు టీమ్ బయటకు పారిపోయింది.

నాన్న మరణాన్ని తలుచుకొని తనీష్

నాన్న మరణాన్ని తలుచుకొని తనీష్

ఎపిసోడ్ చివర్లో భాను శ్రీ కిందపడిపోయిన ఘటనను గుర్తు చేసుకొని తనీష్ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి కూడా మెట్ల మీద నుంచి జారి పడిపోయి మరణించాడని సునైనతో చెప్పి కంటతడి పెట్టాడు. అయితే ఆ ఘటనలో తన తండ్రి చావు మరణంలో అనేక రూమర్లు వచ్చాయని ఆవేదన చెందాడు. ఇంటి సభ్యులు తనీష్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X