ఓ చిన్న అమ్మాయికి గర్భం చేశాడు.. అందుకే ప్రియుడ్ని వదిలేశా..
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనా ఖాన్ తన మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు చేసి అందరికి షాకిచ్చింది. కొద్దికాలంగా కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో ప్రేమలో ఉన్న ఆమె ఒక్కసారిగా బ్రేకప్ చెప్పింది. మెల్విన్‌తో విడిపోయానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో హిందీ టెలివిజన్ మీడియా నివ్వెర పోయింది. ఇక అంతటితో ఆగకుండా తన మాజీ ప్రియుడిపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకు సనాఖాన్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

నా ప్రియుడితో బ్రేకప్..
మెల్విన్‌తో బ్రేకప్ నాకు చాలా ఎమోషనల్ విషయం. నేను బాధపడి కన్నీళ్లు పెట్టుకోవడం లేదు. నేను నమ్మిన వ్యక్తి నాకు మోసం చేయడం భరించలేకపోతున్నాను. ఇన్నాళ్లు నేను ఇలాంటి వ్యక్తితో ట్రావెల్ అయ్యానా? అతడి బారిన పడిన ఇతర అమ్మాయిలను చూస్తే ఇంకా బాధ కలుగుతున్నది అని సనా ఖాన్ తన వాట్సప్ మెసేజ్‌లను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.

మైనర్ బాలికను ప్రెగ్నెంట్ చేసి
ఇక అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. నేను ప్రేమించిన వ్యక్తి మెల్విన్ ఓ మైనర్ బాలికను దారుణంగా వంచించాడు. ఆమెను గర్భవతి చేసి అన్యాయం చేశాడు. కొరియోగ్రఫి శిక్షణ పేరుతో చాలా మంది అమ్మాయిల వద్ద నుంచి డబ్బు తీసుకొన్నాడు. చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు. అలాంటి వ్యక్తి ఓ టీచర్‌గా ఉండవచ్చా? అని సనాఖాన్ ప్రశ్నించింది.

క్యారెక్టర్ లేని వ్యక్తిని
మెల్విన్ క్యారెక్టర్ లేని వ్యక్తి. అతడి వల్ల అమాయకమైన అమ్మాయిలు ఎందుకు బాధపడాలి. భగవంతుడా అతడికి నీవే గుణపాణం నేర్పాలి. అది చూసి చాలా మంది ఊరట పొందాలి అంటూ తన వాట్సప్‌లోని కొన్ని మెసేజ్‌లను సనా ఖాన్ షేర్ చేసింది. తన హృదయం ముక్కలై ద్రవిస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

నా జీవితంలో దారుణమైన పరిస్థితులు
నా జీవితంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. ఇలాంటి కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికి నా థాంక్స్. నా జీవితంలో చూడ కూడని కొన్ని సంఘటనలు నేను చూస్తున్నాను. వాటి నుంచి దూరం కావడానికి మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకొంటున్నాను అని సనా ఖాన్ తెలిపింది.


Click it and Unblock the Notifications











