Bigg Boss Telugu 7: ఇది కదా అసలైన ఉల్టా పుల్టా అంటే.. అంతా కలిసి అర్జున్ ను కార్నర్ చేసేశారుగా!

బిగ్ బాస్ సీజన్ 7 షో విజయవంతంగా సాగుతోంది. ఎనిమిదో వారం కూడా అత్యతిధిక రేటింగ్ తో ముందుకు వెళ్తుంది. ఇంతకాలం వీకెండ్స్ తో పాటు నామినేషన్లు విపరీతమైన ఆసక్తిగా అనిపించేవి. కానీ కథంతా మారిపోయింది. ఇదంతా ఉల్టా పుల్టా కావడంతో ప్రతి రోజుటి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఏరోజు, ఎప్పుడు, ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో, ఎందుకు పడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అప్పటి వరకూ అంతా గ్రూపుగా ఉన్న వారు కూడా ఒకేసారి సైడ్ అయిపోతున్నారు. ఒక్కరినే కార్నర్ చేసి గేమ్ ఆడేస్తున్నారు.

అయితే తాజాగా విడుదల అయిన ప్రోమోలో... బిగ్ బాస్ కాప్టెన్సీ టాస్కులో భాగంగా మూడో గేమ్ పెట్టాడు. ఇప్పటికే రెండు గేములు పూర్తి అయి.. ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్ లు కంటెండర్లుగా నిలవగా... అమర్ దీప్, రతికా రోజ్ కంటెండర్ షిప్ నుంచి తొలగిపోయారు. అయితే తాజాగా పెట్టిన మూడో గేమ్ లో.. అంబటి అర్జున్, అశ్విని శ్రీ, సందీప్ మాస్టర్, భోలె షవాళి పాల్గొన్నట్లు ప్రోమో చూస్తుంటే అర్థం అయిపోతుంది. అయితే స్టోర్ ఇట్, పోర్ ఇట్ అనే ఈ గేమ్ ముందు కామెడీగానే సాగినా ఆ తర్వాత పెద్ద రచ్చ అయిపోయింది.

Sandeep Master Fires on Ambati Arjun in Store it Pour it Task in Bigg Boss Telugu 7 Show

తలపై ఉన్న హెల్మెట్ కు ఓ స్పాంజిని అమర్చారు. నలుగురు కంటెస్టెంట్లు ఆ హెల్మెట్లు ధరించి.. ఓ షవర్ కింద నిల్చోవాలి. వారి తలపై ఉన్న స్పాంజి తడవగానే తమకు కేటాయించిన బౌల్ లో నీటిని వదలాలి. అలా ఎవరి బౌల్ ముందు నిండితే వారే విన్నర్. ఇందులో అంబటి అర్జున్ షవర్ కింద నిల్చొని తన స్పాంజిని తడిసేలా చూసుకుంటున్నాడు. అందరూ తమ ప్రయత్నాలు తాము చేయగా.. అర్జున్ కాస్త పొడవుగా, శారీరకంగా బలంగా ఉండడంతో మిగిలిన వాళ్లను కాస్త పక్కకి తోసేశాడు. ఈక్రంలోనే అశ్వినీని తోయగా ఆమె కింద పడిపోయింది. దీంతో అంతా షాకయ్యారు. ఆమెను పైకి లేపి గేమ్ ను పూర్తి చేసేశారు.

అయితే గేమ్ అయిపోయి బయటకు వచ్చాకా సందీప్ మాస్టర్... ఫిజికల్ గేమ్ ఆడడం తప్పంటూ అమర్ దీప్, టేస్టీ తేజలకు చెప్పాడు. అర్జున్ మొత్తం ఇలా పీక పట్టుకొని తోసేశాడని వివరించాడు. తాను కూడా అలా చేయాలనుకుంటే రెండు నిమిషాలు కూడా పట్టదని.. కానీ తాను అలా ఆడాలనుకోలేదని చెప్పాడు. అర్జున్ గట్టిగా తోయడం వల్లే అశ్విని పడిపోయిందని అన్నాడు. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్లిన అంబటి అర్జున్... శివాజితో మాట్లాడుతూ.. అంతా మాస్టర్ మాస్టర్ అంటున్నారు. మొత్తం నాకు అగనెస్ట్ అయ్యారేంటి అంటాడు.

Sandeep Master Fires on Ambati Arjun in Store it Pour it Task in Bigg Boss Telugu 7 Show

దీనికి శివాజి నవ్వుతాడు. ఇంతకు ముందు అందా నో మాస్టర్ అనే వాళ్లు.. ఇప్పుడంతా మాస్టర్ మాస్టర్ అంటున్నారని అంబటి అర్జున్ చెబుతాడు. దీనికి శివాజి.. గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ నడుచుకుంటూ వెళ్తాడు. ఇక్కడితో ఈ ప్రోమే పూర్తి అయింది. కానీ ఇదంతా చూస్తుంటే.. సీరియల్ బ్యాచ్ మొత్తం కలిసి అర్జున్ ను కార్నర్ చేసినట్లు అర్థం అవుతుంది. ఈరోజుటి ఎపిసోడ్ మొత్తం చూస్తే తప్ప ఏం జరిగిందో తెలియదు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X