Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ ఇంట్లో ఆ కోరికలు కలిగితే.. అలా కంట్రోల్ చేసుకుంటాం.. సందీప్ మాస్టర్ షాకింగ్
బిగ్ బాస్.. ఈ షో చూసేందుకు, ఆసక్తి కల్గించేందుకు చాలా బాగుంటుంది. అలాగే హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లకు కూడా చాలానే లాభం ఉంటుంది. కొందరికి ఉండకపోవచ్చు కూడా. అయితే తినడానికి, పడుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తూ.. అందరినీ ఓ చోట ఉంచి ఆట ఆడించే ఈ షో అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా ఆడ, మగా తేడా లేకుండా అందరినీ సమానంగా చూసే ఈ షోలో.. చాలా మంది స్నేహం, ప్రేమాయణం సాగిస్తుంటారు. తెలుగులో అంతగా లేకపోయినా హిందీ బిగ్ బాస్ షోలో మాత్రం రొమాన్స్ కూడా చేస్తుంటారు.
వారికి నచ్చిన వ్యక్తితో స్నేహం చేసినట్లుగానే... ప్రేమించిన వారితో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అంతా చూస్తున్నారనే భావన కూడా లేకుండా రెచ్చిపోతుంటారు. కానీ మన తెలుగు బిగ్ బాస్ షోలో మాత్రం అలాంటివి ఇప్పటి వరకు జరగలేదు. ముందుముందు కూడా అంతలా చేసే పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేదని చెప్పొచ్చు. నాలుగు గదుల మధ్య చేసుకునే దాన్ని పబ్లిక్ గా చేసుకోవడానికి మన వాళ్లు ఇష్టపడరు. కానీ అలాంటి కోరికలు కల్గే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. మరి అలాంటి సమయాల్లో కంటెస్టెంట్లు ఏం చేస్తారనే అనుమానం చాలా మందికే కల్గి ఉంటుంది.

అయితే ఇలాంటి వాళ్లకోసమే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో కంటెస్టెంట్ సందీప్ మాస్టర్ షాకింగ్ విషయాలు చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. మీరు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు శృంగార కోరికలు కల్గితే ఏం చేసేవారు అని అడిగారు. పెళ్లి కానీ వాళ్లు, ముఖ్యంగా అలాంటి సుఖం ఎప్పుడూ అనుభవించని వారు అంటే అలాంటి ఆలోచనలు ఉండవు. కానీ మీకు పెళ్లి అయింది.. అందమైన జీవితాన్ని గడుపుతున్నారు... చాలా కాలం పాటు భార్యకు దూరంగా ఉన్నారు... అప్పుడు ఆ ఫీలింగ్స్ వస్తే మీరేం చేసేవారని అడగ్గా.. సందీప్ మాస్టర్ ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు.
చాలా చక్కని ప్రశ్న అడిగారు, ఇప్పటి వరకు నన్ను ఇలాంటి క్వశ్చన్ ఎవరూ అడగలేదని సందీప్ మాస్టర్ అన్నారు. అలాగే చాలా మందికి దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని... ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం నాకు వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. అయితే తామంతా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా... అక్కడ ఉన్న వాతావారణానికి అలాంటి కోరికలే కల్గవని చెప్పుకొచ్చారు. నిజానికి అక్కడ ఉంటే ఒత్తిడి, టెన్షన్ వల్ల అసలు ఇదొక అవసరం ఉందనే విషయం కూడా మర్చిపోతామని తెలిపారు. నిజంగానే నా భార్యే అక్కడ ఉన్న.. ఎవరితే మాట్లాడితే ఏం అనుకుంటారు, అలా చూస్తే ఏమవుతుందోనన్న భయంతో చాలా కంట్రోల్ లా ఉంటారని స్పష్టం చేశారు.
నిజంగా రొమాంటిక్ బాయ్స్ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తే.. అమ్మలక్కల్లా మారిపోతారని.. అలాంటి ముచ్చట్లే పెడుతూ అలాగే తయారు అవుతారని సందీప్ మాస్టర్ వెల్లడించారు. ఇది వింటనే నిజమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కపుల్స్ ఇంట్లోకి వెళ్లినా అలాంటి పనులు చేయలేదు. స్నేహితుల్లానే కలిసి ఉన్నారు. వరుణ్ సందేశ్, వితికా శేరు, మొన్నీమధ్యే వెళ్లిన మెరీనా అండ్ రోహిత్ లు కూడా ఎలాంటి పిచ్చి పనులు చేయలేదు. అందరిలాగే కామన్ గా కనిపించారు.


Click it and Unblock the Notifications











