Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అమ్మ బాబోయ్ ఇది మామూలు ప్లానింగ్ కాదు.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’తో మల్లెమాల భారీ స్కెచ్
బుల్లితెరపై రాను రాను పోటీ మరీ ఎక్కువైపోతోంది. ఎవరు ఎంటర్టైన్మెంట్‌కు ఎక్కువ ఇస్తే ఆ చానెల్‌ను, ఆ ప్రోగ్రాంను ఆదరిస్తుంటారు. అలా తెలుగులో ఎంటర్టైన్మెంట్ అంటే ఈటీవీ గుర్తుకు వస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఢీ, జబర్దస్త్ వంటి వాటితో మల్లెమాల బ్రాండ్ ఓ రేంజ్‌లొ పెరిగిపోయింది. ఇప్పుడు మల్లెమాల నుంచి మరో కొత్త షో ప్రారంభం కాబోతోంది. అయితే దీని టైమింగ్స్ చూస్తే అందరికీ షాక్ తగిలిపోతుంది.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

శ్రీదేవీ డ్రామా కంపెనీ..
శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ కొత్త షో రాబోతోందని గత నెలలోనే కొన్ని ప్రోమోలను వదిలారు. ఇందులో శ్రీముఖి దడదడలాడించింది. సీరియల్ హీరో అర్జున్‌ను హోస్ట్‌గా తీసుకొచ్చారు. స్టార్ మా చానెల్‌లో సీరియల్ హీరో అయిన అర్జున్ ఇలా మల్లెమాల షోలో కనిపించడం కాస్త విచిత్రమే. అయితే తాజాగా అసలు సిసలు ప్రోమోను వదిలారు.

అందరి పరిచయం..
శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రోమోలో కొంతమందిని చూపించారు. అందులో కొత్త కొత్త వారంతా కనిపించారు. కొత్త విన్యాసాలు, కొత్త కాన్సెప్ట్‌లతో రచ్చ చేశారు. మళ్లీ ఇమాన్యుయేల్, నూకరాజు, వర్ష, సంగీత వంటివారు ఇందులోనూ కనిపించారు.

హీరోయిన్ రేఖ సైతం..
నాటి హీరోయిన్ రేఖ సైతం శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలో రేఖ స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసినట్టుంది. మొత్తానికి ఈ సరికొత్త షోను మాత్రం చాలా గ్రాండ్‌గా ప్రారంభించేశారు. అయితే దాని టైమింగ్ విషయంలోనే అందరూ కామెంట్ చేస్తున్నారు.

మధ్యాహ్నం సమయంలో..
మామూలుగా కామెడీ షో లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఎవ్వరైనా కూడా ప్రైమ్ టైంలో లేదంటే రాత్రి తొమ్మిది గంటల తరువాతనో ప్లాన్ చేసుకుంటారు. కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీని మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రసారం చేస్తామని తెలిపారు. అయితే దీంట్లోనూ ఓ లాజిక్ ఉందనితెలుస్తోంది.

కామెడీ స్టార్స్‌కు పోటీగా..
అయితే స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే ఓ షో ప్రారంభం కాబోతోందన్న సంగతి తెలిసిందే. ఆ షో కూడా ఇలానే ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారట. ఇలా రెండు ప్రోగ్రాంలను కావాలనే బరిలోకి దింపినట్టు కనిపిస్తోంది. మరి ఈ రెంటిలో ఏది నిలుస్తుందో చూడాలి.