For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కో ఈవెంట్‌కు సంగీత అంత పుచ్చుకుంటుందా.. బుల్లితెరపై ఆ రేంజ్‌లో రెమ్యూనరేషనా?

    |

    ప్రస్తుతం బుల్లితెర రేంజ్ ఎంతగానో పెరిగింది. వెండితెరపై ఎంత గ్రాండ్‌గా ఈవెంట్లు జరుగుతుంటాయో.. బుల్లితెరపైనా అదే రేంజ్‌లో నిర్వహిస్తుంటారు. ప్రతీ పండగకు బుల్లితెరపై ప్రముఖ చానెళ్లు భారీగా ఖర్చు పెట్టి స్పెషల్ ఈవెంట్లు చేస్తున్నారు. వినాయక చవితి, ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళికి మాత్రం కచ్చితంగా స్పెషల్ ఈవెంట్లు ఉండాల్సింది. ఇందులో ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ముందు వరుసలో ఉంటాయి.

    ఈ సారి కూడా..

    ఈ సారి కూడా..

    దసరాకు స్పెషల్ ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మూడు ప్రోమోలను విడుదల చేసిన జబర్దస్త్ టీం అంచనాలను పంచేసింది. అక్కా ఎవరే అతగాడు అంటూ దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది. ఇక స్టార్ మా తమ సీరియల్ ఆర్టిస్ట్‌లతో జాతరో జాతర అంటూ రెడీ అవుతున్నారు. జీ తెలుగు వారు శ్రీముఖి-ప్రదీప్ పెళ్లి అంటూ ముందుకు వస్తున్నారు.

    అక్కా ఎవరే అతగాడు..

    అక్కా ఎవరే అతగాడు..

    ఈ టీవీలో స్పెషల్ ఈవెంట్ అంటే రోజా, శేఖర్ మాస్టర్, సుధీర్, వర్షిణి, హైపర్ ఆది ఇలా కొంత మంది ఫిక్స్డ్‌గా ఉంటారు. కానీ ఈ సారి మాత్రం కొన్ని మార్పులు వచ్చాయి. రోజా స్థానంలో సంగీతను తీసుకున్నారు. నవదీప్ కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు.

    మెల్లిగా సెటిల్..

    మెల్లిగా సెటిల్..

    సంగీత ఇంతకు ముందుకు కూడా బుల్లితెరపై మెరిసింది. ఆ మధ్య నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన తరువాత ఓసారి జడ్జ్‌గా రోజాతో పాటు వచ్చింది. అయితే ఆది ఒక్క ఎపిసోడ్ కోసమే. మళ్లీ ఇలా ఈ ఈవెంట్‌లో మెరిసింది. సంగీత ఒక్క ఈవెంట్‌కు ఎంత తీసుకుంటుందో తాజాగా బయట పడింది.

    రాకెట్ రాఘవ స్కిట్..

    రాకెట్ రాఘవ స్కిట్..

    ఖడ్గం సినిమాలో సంగీత వేసుకున్న గెటప్‌లో వచ్చిన రాఘవ అసలు గుట్టు రట్టు చేశాడు. ఒక్క చాన్స్ అంటూ తిరుగుతూ మల్లెమాలకు వచ్చాను మొదటి సారి జబర్దస్త్ జడ్జ్‌గా ఇచ్చారు. మళ్లీ ఒక్క చాన్స్ అని అడిగాను ఈ దసరా ఈవెంట్ ఇచ్చారు. మళ్లీ ఒక్క చాన్స్ అడిగితే.. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నారు.. పది లక్షలు వేస్ట్ చేసుకోవడం ఎందుకనిని పెట్టలేదంటూ అసలు సంగతి తెలిపాడు.

    పది లక్షలా?

    పది లక్షలా?

    అయితే అగ్రిమెంట్ రాసుకుంటే ఒక్క ఈవెంట్‌కు ఇంత పెద్ద మొత్తంలో అందదు. ఈవెంట్‌ పరంగా చూసుకుంటే ఇంత డిమాండ్ చేసినట్టుంది. ఏది ఏమైనా పది లక్షలు మాత్రం చాలా పెద్దమొత్తమేనని టాక్ వినిపిస్తోంది. ఇలా బుల్లితెరపైనా మంచి గిరాకే ఉందన్నమాట.

    English summary
    Sekhar Master Romance With Rashmi And varshini In Akka Evare Athagadu, Sekhar Master Grand Re Entry In Small Screen Fater Corona.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X