Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాండ్ గర్ల్ గా ఇలా సానియా మీర్జా (వీడియో)
హైదరాబాద్ : తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ టెన్నీస్ సంచలనం సానియా మీర్జా వరస విజయాలతో దూసుకుపోతూ తనకో హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని రీసెంట్ గా ట్వీట్ చేసి అందరినీ తన వైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే. డేనియర్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 24వ బాండ్ సినిమాలో తను ఎంపికయ్యానంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలియచేయటంతో అందరూ ఆశ్చర్యపోయి...శుభాకాంక్షలు తెలిపారు.
అంతేకాకుండా తాను బాండింగ్ తో ముందుకు వెళ్తున్నానని, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నట్లు తెలిపింది. అయితే అసలు నిజం వేరు. ఆమె బాండ్ సినిమాలో నటించలేదు. బాండ్ సినిమాల నేపధ్యంలో సోనీ మాక్స్ టీవీ వారు చేస్తున్న స్కూల్ ఆఫ్ బాండింగ్ ...పోగ్రామ్ లో యాంకర్ గా కనిపించనుంది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేసారు. మీరూ చూడండి ఆ ప్రోమోని..ఇప్పుడు మీకు నిజం తెలుస్తుంది.
బాండ్ చిత్రం విషయానికి వస్తే...
ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్ డిసెంబర్ 6న మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. లండన్ లోని పినెవుడ్ స్టూడిమోస్ సమీపంలో ఈ షూటింగ్ జరుగనుంది. స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు
కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించబోతున్నాడు. గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ పని చేయబోతున్నారు. 2015 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రిటన్‌లో అక్టోబర్ 23, 2015న, అమెరికాలో నవంబర్ 6, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.