మా అమ్మను కూడా వదలవా? స్టార్ కమెడియన్‌పై సానియా మిర్జా..
జాతీయ ఛానెల్‌లో కామెడీ షోలలో టాప్ కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకొవచ్చు. పలు సినిమాల ప్రమోషన్స్, ప్రముఖుల ఇంటర్వ్యూలు చాలా వినోదంగా సాగిపోతుంటాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న అలాంటి కామెడీ షోకు స్పోర్ట్ స్టార్, అందాల టెన్నిస్ తార సానియా మిర్జా వచ్చారు. ఈ సందర్బంగా సాగిన ఇంటర్వ్యూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. కపిల్ శర్మ అడిగిన ప్రశ్నలకు సానియా ఎలా సమాధానం ఇచ్చారంటే.

ఇండియా, పాక్ మ్యాచ్ గురించి
కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో సానియాను ప్రేక్షకులు ఓ ప్రశ్న అడిగారు. ఇండియా, పాక్ మ్యాచ్ నడుస్తుంటే.. ఎవరు గెలువాలని కోరుకొంటారు అని ప్రశ్నకు సానియా సమాధానం ఇస్తూ.. ఇది అడగాల్సిన ప్రశ్నేనా? నేను ఎఫ్పుడు ఇండియానే గెలువాలని కోరుకొంటాను. కానీ నా భర్త షోయబ్ మాత్రం హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ కొట్టాలని కోరుకొంటాను అని సానియా జవాబు ఇచ్చింది.

షోయబ్‌తో పెళ్లి తర్వాత
ఇక షోయబ్‌తో పెళ్లి తర్వాత లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయా? లేక ఆగిపోయాయా? అని కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పెళ్లి తర్వాతనే ఎక్కువగా లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయని సానియా అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా పట్టించుకోకుండా నాకు ప్రపోజల్స్ పంపుతున్నారని అన్నారు.

సానియాను ఆట పట్టించబోయి..
సానియాను కపిల్ శర్మ ఆటపట్టించే క్రమంలో.. ఇంత పెద్ద స్టార్‌కు ఇంత చిన్న తల్లి ఉంటారా? ఇంత చిన్న వయసులో ఇంత అందమైన అమ్మ ఎలా ఉంది అంటూ ఏదో అడగబోతుండగా.. నాతో సరదాగా మాట్లాడిన ఫర్వాలేదు.. కనీసం అమ్మను కూడా వదలవా? అంటూ సానియా చిలిపిగా సమాధానం ఇచ్చింది.

సానియా బయోపిక్ గురించి
ఇక సానియా మిర్జా బయోపిక్ చేస్తే.. ఏ బాలీవుడ్ హీరోయిన్ అయితే మీ జీవిత చరిత్ర తెరపై పండుతుంది అనే పశ్నకు సమాధానం ఇస్తూ.. దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లు చాలా పెద్ద స్టార్లు.. వాళ్లు చేస్తారో లేదో తెలియదు. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ పరిణితి చోప్రా అయితే కరెక్ట్‌గా ఉంటుంది అని సానియా సమాధానం ఇచ్చింది.

సానియానే బయోపిక్‌లో నటించాలి
అయితే సానియా పాత్రను తెర మీద ఎవరు పోషించాలనే ప్రశ్నను సానియా తల్లిని అడిగితే.. ఎవరు చూసినా ఆ పాత్ర అంత ఎఫెక్ట్‌గా ఉండదు. నాకు తెలిసి ఆ పాత్రను సానియా మాత్రమే చేయాలి. ఆ పాత్రలో సానియా మాత్రమే నటించాలి. అప్పుడే ఆ పాత్రకు సార్థకత ఏర్పడుతుంది అని సానియా తల్లి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











