ఫోన్ ద్వారా నగ్న చిత్రాలు పంపిన నటుడు అరెస్ట్

వివరాల్లోకి వెళితే... ఓ వివాహిత నగ్న చిత్రాలను ఇంటర్ నెట్ లోని మెయిల్ ద్వారా పంపించిన బుల్లితెర నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తుడు సనీల్ సోధి రిస్తే.. హమ్ ధారావాహికలో నటిస్తున్నారు. 'హుతూతూ' చిత్రంలో టబు, సునీల్ షెట్టి, 'హజార్ చౌరసీ కీ'లో జయా బచ్చన్, నందితాతో కలిసి సనీల్ నటించారు.
సనీల్ తన వద్దనున్న బ్లాక్‌బెర్రీ మొబైల్ సహాయంతో 25 నగ్న చిత్రాలు, కొన్ని అసభ్యకర సందేశాలను ఈ-మేయిల్ ద్వారా ఒక మహిళకు పంపించాడు. ఆమె అతడి స్నేహితురాలు కూడా. ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు సనీల్‌ను అరెస్టు చేశారు. ఈ విషయమై సనీల్ కుబుటం దిగ్బాంతి వ్యక్తం చేసింది. సనీల్ అలాంటి వాడు కాదని ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని వారు వాదిస్తున్నారు.
పోలీసులు మాట్లాడుతూ... "మేం సోధి మీద ఐపిసి సెక్షన్ 509 , మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీ యాక్ట్ 67 ప్రకారం కేసు నమోదు చేసాం ,"అన్నారు. ఈ కేసు ఒకటి రెండు రోజుల్లో కోర్టుకి వెళ్లనుంది. నిందుతుడుకి శిక్ష బాగానే పడే అవకాసం ఉందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











