తేజస్వి.. నీకు ఎందుకు ఈ నోటిదూల.. కుళ్లు.. సెలబ్రిటీవైతే బయట చూసుకో.. సంజన ఫైర్

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Sanjana Scolds Tejaswini

బిగ్‌బాస్2 రియాలిటీ షో ఇప్పుడిప్పుడే వివాదాలతో ముదిరి పాకాన పడుతున్నది. కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నె, సెలబ్రిటీ క్యాటగిరిలో హౌస్‌లో కాలుపెట్టిన తేజస్వి మదివాడ మధ్య అధిపత్య పోరు నాలుగురోజున హైలెట్‌గా నిలిచింది. సాధారణంగానే నోరు పారేసుకొనే సంజన.. తేజస్విపై ఒంటికాలుపై లేచింది. వారి మధ్య గొడవకు వంట అంశం కారణమైంది.

బిగ్‌బాస్‌లో గ్రూపు రాజకీయాలు

బిగ్‌బాస్‌లో గ్రూపు రాజకీయాలు

బిగ్‌బాస్‌లో గ్రూపుల మధ్య రాజకీయాలు బాగానే కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్ ఎవరుంటారు అనే విషయంపై తేజస్వి చెప్పిన విషయాలను సంజనకు దీప్తి సునయన పూసగుచ్చినట్టు చెప్పింది. సంజన ఫైనల్ వరకు ఉంటుంది అని తేజస్వి చెప్పిన విషయాన్ని సునయన పేర్కొన్నది.

సంజన, తేజస్వి మధ్య గొడవ

సంజన, తేజస్వి మధ్య గొడవ

వంట చేసి పాయింట్లు కొట్టేస్తున్నారనే విషయంపై సంజన, తేజస్వి మధ్య వాగ్వాదం భారీగా జరిగింది. పాయింట్ల కోసం వంట చేస్తున్నామా అని సంజన నిలదీసింది. దాంతో నీ టోన్ మార్చుకో అని తేజస్వి హెచ్చరించింది. అందుకు సమాధానంగా నీ పద్దతి మార్చుకో అని సంజన కౌంటర్ ఇచ్చింది.

మాతోనే ఎందుకు గొడవ

మాతోనే ఎందుకు గొడవ

మా టీమ్‌లో ఉన్నా మాతోనే కొట్లాడుతావ్.. వేరే టీమ్‌లో ఉన్నా మాతోనే గొడవపడుతావ్ అని సంజనకు తేజస్వి హెచ్చరించింది. పక్కవారిపై ఇంప్రెస్ రావొద్దని ఫీల్ అవుతున్నావు. పక్కన వాళ్లను ఇంప్రెస్ చేయాలని టెన్షన్ పడుతున్నావు అని సంజన్ ఫైర్ అయింది.

గీతా మాధురికి సంజన ఫిర్యాదు

గీతా మాధురికి సంజన ఫిర్యాదు

సంజన, తేజస్విని వంట వివాదం గీతామాధురి వద్దకు చేరింది. పాయింట్ల కోసం తేజస్వి వంట చేస్తున్నదని నేను చెప్పినట్టు తేజస్విని చెప్పింది. నేను అలా చెప్పానా? తేజస్వి నోటి దూల ఎందుకు సంజన నిలదీసింది. నాకు వంట చేయాలని ఉంది. నేను రెడీగా ఉంటే అందరి మధ్య పుల్లలు పెడుతుంది అని సంజన ఆగ్రహం వ్యక్తం చేసింది.

సెలబ్రిటీలు, తోపులైతే బయట చూసుకో

సెలబ్రిటీలు, తోపులైతే బయట చూసుకో

సెలబ్రిటీ, తోపులయితే బయట చూసుకోవాలి. ఇక్కడ ఎవరూ కాదు. తేజస్విని డామినెట్ చేయడానికి ప్రయత్నిసున్నది. నా టెంపర్ బయటకు వస్తే నా విషయం వేరేలా ఉంటుంది. నాపై పిచ్చ కుళ్లు ఉంది. నేను అనని మాటలు అంటే నాకు మండుతుంది. మేము కూడా ఆడిషన్స్‌లో సెలక్ట్ అయి బిగ్‌బాస్‌కు వచ్చాం.

రచ్చ రచ్చ చేస్తానని సంజన వార్నింగ్

రచ్చ రచ్చ చేస్తానని సంజన వార్నింగ్

బిగ్‌బాస్‌లో తోపులం, సెలబ్రిటీలం అని ఫీలు కావొద్దు. అందుకు ఒక్కటే ఇక్కడ. నాపై లేనిపోనివి చెబుతున్నది. ఫైనల్ వరకు సంజన ఉండేందుకు ప్లాన్ చేస్తున్నది అని తేజస్విని చెబుతున్నదని గీతామాధురికి ఫిర్యాదు చేసింది. బయటకు వెళ్లే పరిస్థితి వస్తే రచ్చ రచ్చ చేసి వెళ్లాను అని వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఎమోషనల్ కావొద్దు అని సంజనకు గీతామాధురి చెప్పింది. ఇలాంటి వివాదాస్పద అంశాలతో మొదటి వారమే గరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X