బాబు గోగినేని సైకో.. టార్చర్ పెట్టాడు.. నానికి కాలుతుంది.. కొందరు వెధవలంటూ సంజన ఫైర్

By Rajababu

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నె వివాదాస్పద వ్యక్తిగా మారింది. ఇంట్లోకి వెళ్లిన తొలివారమే బయటకు వచ్చారు. బిగ్‌బాస్ నుంచి కాంట్రవర్సీగా బయటకు వచ్చిన ఆమె మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలనంగా మారింది. ఇటీవల ఓ మీడియాకు వచ్చి బాబు గోగినేనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె ఏమన్నారంటే..

Recommended Video

Bigg Boss Season 2 Telugu : బాబు గోగినేని మెడ కు కేసుల ఉచ్చు
నానిని చూస్తే కోపం వస్తుంది

నానిని చూస్తే కోపం వస్తుంది

నాని చూస్తే నాకు కోపం వస్తున్నది. ఎందుకంటే గణేష్ బర్త్ డే రోజున నేను గ్రీటింగ్ కార్డు పంపితే బిగ్‌బాస్ షోలో ప్రసారం చేయలేదు. చూపించలేదు. దానిని బట్టి ఆయనకు ఏమైనా కోపం ఉందో అనే ఫీలింగ్ కలుగుతున్నది. నాపై ఆయన ఎందుకు నెగిటివ్ ఒపినియన్ ఉందో తెలియదు అని సంజన అన్నారు.

 బాబు గోగినేని అంటే గౌరవం లేదు

బాబు గోగినేని అంటే గౌరవం లేదు

బాబు గోగినేని అంటే నాకు చాలా గౌరవం. ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి. ఆయనకు చాలా నాలెడ్జి ఉంది. వ్యక్తిగతంగా గౌరవిస్తాను కానీ.. బిగ్‌బాస్ గేమ్‌లో మాత్రం ఆయన గౌరవం లేదు. ఆయన ఈ గేమ్‌కు సరిపోడు. అవసరమైనప్పుడు నాలుగు మాటలు మాట్లాడుతాడు. గొడవ ఏమైనా అయితే రూల్స్ మాట్లాడుతాడు. ఆ తర్వాత తింటాడు. పడుకొంటాడు అని సంజన తెలిపింది.

 బాబు గోగినేని వల్లనే గొడవలు

బాబు గోగినేని వల్లనే గొడవలు

బాబు గోగినేనికి నాకు సరిగా పడలేదు. నేను నిప్పు.. ఆయన ఉప్పు. ఎంతో హోదా ఉన్న బాబు గోగినేని నీచమైన డ్రస్సులు వేసుకొంటున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత ఆయన ప్రతిష్ట్ర దిగజారింది. ఇప్పుడు బాబును చూసి అసహ్యించుకొంటున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో బాబు గోగినేని ఉంటే ఇంటి పెద్దలా వ్యవహరిస్తాడని అందరూ అనుకొన్నారు. కానీ ఆయన వల్లనే ఇంట్లో గొడవలు అవుతున్నాయి.

బాబు గోగినేని ఓ సైకో

బాబు గోగినేని ఓ సైకో

బాబు గోగినేని చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఓ టాస్క్‌లో ఏ పని చెప్పవద్దు. ఆమెకు సిగ్గు రావాలి అని బాబు కామెంట్ చేశారు. ఆయన ప్రవర్తన వల్ల నాకు చాలా బాధ ఏర్పడింది. నన్ను మెంటల్‌గా టార్చర్ చేసిన ఆయన ఓ సైకో. బయటకు వచ్చిన తర్వాత ఆయనపై కేసు పెడుదామా అనేంత కోపం వచ్చింది.

గణేష్‌ను చూస్తే బాధేస్తున్నది

గణేష్‌ను చూస్తే బాధేస్తున్నది

బిగ్‌బాస్‌ హౌస్‌లో గణేష్‌ను చూస్తే బాధ వేసింది. ఎవరైనా తనకు తాను నామినేట్ చేసుకొంటాడా? ఎవరైనా వారంపాటు ఫ్రూట్స్ తింటాడా? అని సంజన అన్నారు. ఎవరినైనా ఎలిమినేషన్‌ నుంచి తప్పించడానికి ఆ ప్రయత్నం చేస్తే అది కరెక్ట్. కానీ ఒకడిని గేమ్ నుంచి తప్పించడానికి స్వయంగా నామినేట్ చేసుకోవడం దారుణం. బిగ్‌బాస్‌కు వెళ్లింది ఒకరిని గెలిపించడానికా అని ప్రశ్నించారు.

క్యారెక్టర్ చంపుకోలేను

క్యారెక్టర్ చంపుకోలేను

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేది ఒకటి.. బయటకు కనిపించేది ఒకటి. బిగ్‌బాస్‌లో కొన్ని విషయాల పట్ల రాజీ పడలేదు. ఒక్క షో కోసం నా క్యారెక్టర్‌ను చంపుకోలేదు. ఇంట్లో రూమర్లు సృష్టించలేదు. ముక్కుసూటిగా మాట్లాడటం వల్లనే నాకు సమస్యలు ఎదురయ్యాయి.

వెధవలకు కడుపు మంటగా

వెధవలకు కడుపు మంటగా

కొందరు బిగ్‌బాస్‌‌లోకి వచ్చిన తర్వాతే సెలబ్రిటీలు అయ్యారు. బిగ్‌బాస్‌కు ముందు కిరిటీ అంటే నాకు ఎవరో తెలియదు. నా మాటలకు ఆయన బాధపడటం నాకు నచ్చలేదు. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం కొందరు వెధవలకు కడుపునొప్పిగా మారింది.

గీతా మాధురి, కౌశల్ అంటే ఇష్టం

గీతా మాధురి, కౌశల్ అంటే ఇష్టం

బిగ్‌బాస్‌ హౌస్‌లో గీతా మాధురి అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికైనా ఏమైనా అయితే త్వరగా స్పందిస్తారు. ప్రేమగా చూసుకొంటారు కౌశల్ మంచి వ్యక్తి. ఓ విషయంలో నాపై కోపంగా వ్యవహరించడం గేమ్‌లో భాగమే. దీప్తి సునైన తెలివిగా గేమ్ ఆడుతున్నది. మనమంతా ఓ జట్టుగా ఉందామని చెప్పింది. కానీ తనీష్‌కు దగ్గర కావడంతో మమల్ని గాలికి వదిలేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X