ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్లు తాగించా... ఇదో లెక్కా? : బిగ్‌బాస్‌తో బాబు గోగినేని
Recommended Video

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వారం జరిగిన ఎలిమినేషన్లో మిస్ హైదరాబాద్ సంజన షో నుండి ఔట్ అయిన సంగతి తెలిసిందే. షో నుండి వెళుతూ తనకు దక్కిన బిగ్ బాంబ్ అవకాశాన్ని బాబు గోగినేనిపై ప్రయోగించింది. దీని ప్రకారం వారం రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఎవరికి నీళ్లు అవసరం వచ్చినా బాబు గోగినేని తీసుకెళ్లి ఇవ్వాలి. తనపై సంజన వేసిన బిగ్ బాంబును బాబు గోగినేని సంతోషంగా స్వీకరించడంతో పాటు ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్లు
బిగ్ బాస్ షోకి రాక ముందు తాను అనేక టీవీ డిబేట్లలో ఒక్కొక్కడికి మూడు చెరువుల నీరు తాగించాను..... అలాంటి నాకు ఇంట్లో వారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం ఏమీ కాదు. బిగ్ బాస్ చెప్పినట్లు రూల్స్ తప్పకుండా ఫాలో అవుతాను అని బాబు గోగినేని తెలిపారు.

సంజన పిచ్చిగా ప్రవర్తించింది
సంజన తనపై ఇలాంటి బాంబు ఎందుకు వేసిందో తెలియదని, ఇది ఆమె చేసిన పిచ్చి పనిగా బాబు గోగినేని పేర్కొన్నారు. సంజనను బిగ్ బాస్ ఇంట్లో తాను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, నాపై కోపం ఎందుకు పెంచుకుందో తెలియదు అన్నారు.

మిత్రులు వద్దంటున్నారు కానీ..
నాపై అభిమానంతో, ప్రేమతో ఇంట్లోకి కొంత మంది మిత్రులు సంజన వేసిన బిగ్ బాంబ్ రూల్ బ్రేక్ చేసి.... ఎవరి నీళ్లు వారే పట్టించుకుంటామని అంటున్నారు. కానీ రూల్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. బిగ్ బాస్ చెప్పినట్లు నేను చేస్తాను అని ఈ సందర్బంగా బాబు గోగినేని స్పష్టం చేశారు.

బాబు గోగినేనిపై సంజన సంచలన కామెంట్స్
ఎలిమినేషన్ అయి బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళుతూ సంజన సంచలన కామెంట్స్ చేశారు. బాబు గోగినేని బయటకు కనిపించేంత మంచి మనిషి కాదని, అతడితో జాగ్రత్తగా ఉండాలని ఇంటి సభ్యులకు సూచించింది.


Click it and Unblock the Notifications











