Bigg Boss Buzzz: బిగ్‌బాస్ చరిత్రలో సంజన రికార్డు.. ఇమ్మూతో బాండింగ్ ఫ్లానా?.. మమ్మా కోరికకు శివాజీ షాక్..
Sanjjanaa Galrani Buzzz Interview: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9ని హై వోల్టేజ్ షోగా మార్చిన కంటెస్టెంట్ సంజన. తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఆమె ఆటలో దూకుడు స్పష్టంగా కనిపించింది. 'గుడ్డు దొంగతనం' టాస్క్‌తో షోకు పేస్ ఇచ్చి, మాటల యుద్ధాలు, వ్యూహాలు, ఎమోషన్లతో బిగ్ బాస్ ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి హౌస్‌లోకి అడుగుపెట్టినా, ఎప్పుడూ సింపతి కార్డు ఆడకుండా గేమ్‌పై ఫోకస్ పెట్టిన తీరు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. బిగ్‌బాస్ జర్నీలో ఆమెకు ఇచ్చిన ఎలివేషన్ చూస్తే.. ఆమె ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. టైటిల్ దక్కకపోయినా, టాప్ 5 వరకు సాగిన సంజన ప్రయాణం బిగ్‌బాస్ 9లో గేమ్ ఛేంజర్‌గా గుర్తుండిపోయింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసిన తర్వాత సంజన తొలిసారి శివాజీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. 15 వారాల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ 'గుడ్డు దొంగతనంతో మొదలుపెట్టి వెరీ గుడ్ పర్ఫార్మెన్స్‌తో ఎండ్ అయింది మీ జర్నీ'అంటూ శివాజీ సంజనను ప్రశంసల వర్షంలో ముంచాడు. ఈ సందర్భంగా సంజనను సర్‌ప్రైజ్ చేస్తూ గుడ్డు దొంగతనానికి సింబాలిక్‌గా ఎగ్ బాస్కెట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు శివాజీ. దీనికి సంజన "నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేశా" అంటూ సరదాగా స్పందించింది. అంతేకాదు, 'తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్ 5కి రాలేదు... ఆ రికార్డును మీరు బ్రేక్ చేశారు'అంటూ సంజనను ప్రత్యేకంగా అభినందించాడు.

ఇంటర్వ్యూ ఆరంభంలోనే శివాజీ.. 'మీరు టాప్ 5లో ఉంటారని ఎప్పుడైనా అనుకున్నారా?' అని ప్రశ్నించగా, సంజన ఎలాంటి తడబాటు లేకుండా 'ఆఫ్‌కోర్స్... కచ్చితంగా ఉంటానని అనుకున్నా'అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం అడిగితే ' నేను బెంగళూరు నుంచి 100 డ్రెస్సులు ప్యాక్ చేసుకుని వచ్చా' అంటూ చేసిన రివీల్‌తో శివాజీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక సంజన మాట్లాడే స్టైల్ కూడా ఇంటర్వ్యూకు కామెడీ టచ్ ఇచ్చింది. 'మీరు అలా అడిగితే నా గుండె పగిలిపోతుంది'అని చెప్పాల్సిన చోట 'నా గుండె చిరిగిపోతుంది'అంటూ తడబడింది. దీంతో శివాజీ తన కామెడీ సెన్స్ తో ఆ సీన్‌ను హైలైట్ చేశాడు.
తర్వాత ఇమ్మాన్యుయేల్‌తో బాండ్ గురించి ప్రశ్నిస్తూ 'చాలా తెలివిగా ఎంటర్టైనర్‌ను పక్కన పెట్టుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వొచ్చని అనుకున్నారా?'అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. దీనికి సంజన.. ఇమ్ముతో తనకున్న అనుబంధాన్ని, బాండింగ్‌ను షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూలో భాగంగా శివాజీ ఓ టాస్క్ కూడా ఇచ్చాడు. స్క్రీన్‌పై కంటెస్టెంట్ల ఫోటోలు చూపించి, 'మీ హార్ట్ హ్యాపీ చేసినవారు ఎవరు? హార్ట్ బ్రేక్ చేసినవారు ఎవరు?' అని అడిగాడు. ముందుగా తనూజ ఫోటో చూపించగా, సంజన హార్ట్ బ్రేక్ సింబల్ చూపించింది. ఆ తర్వాత విన్నర్ కళ్యాణ్ పడాల ఫోటో చూపించగానే మరోసారి హార్ట్ బ్రేక్ సింబల్ చూపించడంతో శివాజీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఆ తర్వాత సంజన తన జీవితంలోని కష్టాలను గుర్తు చేసుకుంది. ముఖ్యంగా 2020 డ్రగ్స్ కేస్ ప్రస్తావన తెచ్చి ఎమోషనల్ అయింది. 'డబ్బు లేకుండా జీవించవచ్చు... కానీ మన మర్యాద మీద దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేం' అంటూ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. దీనిపై శివాజీ.. 'మీ మీద వచ్చిన నిందాను ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ఈ జర్నీకి సంబంధం ఏంటి?' అని ప్రశ్నించగా, సంజన ఎమోషనల్ గా స్పందించింది.
'నా పిల్లలు స్కూల్‌కు వెళ్లినా, బయటికి వెళ్లినా... 'మీ అమ్మ ఎవరు?' అని అడిగితే 2020 డ్రగ్స్ కేస్ పేరు కాదు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ మా అమ్మ అని గర్వంగా చెప్పాలి. అదే మాట నా పిల్లలు వినాలి... వాళ్లు సమాజంలో గర్వంగా బతకాలి' అంటూ భావోద్వేగంగా చెప్పింది.
ఆ మాటలకు ఫిదా అయిన శివాజీ .. 'రియల్లీ సంజన గ్రేట్'అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి, ఆమె ఆటతీరును మరోసారి ప్రశంసించాడు. మొత్తం మీద ఈ బిగ్‌బాస్ బజ్ ఎపిసోడ్ కామెడీ, ఎమోషన్, షాకింగ్ రివీల్స్‌తో చాలా రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ బజ్ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











