సంజన ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. రీతూ, తనూజల త్యాగాలతో కరిగిపోయిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9లో ఊహించని పరిణామాలతో హౌస్ హీటెక్కిపోతోంది. మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న వార్తలను నిజం చేస్తూ టాప్ కంటెస్టెంట్‌గా దూసుకెళ్తున్న సంజన గల్రానీని హౌస్ మెట్స్‌తోనే ఎలిమినేట్ చేయించారు. అందరూ ఆమె సీక్రెట్ రూంలో ఉంటుందని భావించగా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ వివరాల్లోకి వెళితే..
సంజనను ఎలిమినేట్ చేసిన నలుగురు
శుక్రవారం అర్ధరాత్రి హౌస్‌మెట్స్ నిద్రలో ఉండగా అలారం మోగించిన బిగ్‌బాస్.. రెడ్ సీడ్ వచ్చిన వారికి దివ్య, ఫ్లోరా షైనీలను తప్పించి ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. దాంతో రెడ్ సీడ్ వచ్చిన భరణి, హరిత హరీష్, రాము రాథోడ్, డిమోన్ పవన్‌లు మరో మాట లేకుండా సంజన పేరును ఇందుకు సెలెక్ట్ చేసి తమ నిర్ణయాన్ని చెప్పారు. దాంతో సంజనను బట్టలు సర్దుకుని బయటకు వచ్చేయమని బిగ్‌బాస్ ఆదేశించడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఇమ్ము అయితే కన్నీరు ఆపుకోలేకపోయాడు.

సీక్రెట్ రూమ్ కాదు ఎలిమినేషన్
సంజన ఎలిమినేట్ కారని సీక్రెట్ రూమ్‌లో దాచి ఉంచారని కొందరు కంటెస్టెంట్స్ అనుకున్నారు. అందుకు తగినట్లుగానే సంజన సీక్రెట్ రూమ్‌లో కనిపించింది. దీంతో ఆమె మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారని సంజన అభిమానులు అనుకున్నారు. కానీ ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్ ప్రారంభం కాగానే హోస్ట్ నాగార్జున స్టైలీష్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ వెంటనే సంజనను స్టేజ్ మీదకి పిలవడంతో అందరూ అవాక్కయ్యారు. సంజన నిజంగా ఎలిమినేట్ అయిపోయారని అంతా ఫిక్స్ అయ్యారు.
సంజన ఎలిమినేషన్‌లో ట్విస్ట్
నేను ఎలిమినేట్ కావడానికి అంతగా బ్యాడ్ ఏం చేశానో అర్థం కావడం లేదని నాగార్జున దగ్గర వాదించింది సంజన. కంటెస్టెంట్స్ గురించి సంజన అభిప్రాయాలు తీసుకున్నాడు నాగార్జున. ఈ సందర్భంగా హరీశ్‌ను ఏకీపారేసింది సంజన. అతను నీట్‌గా ఉండడని, వేసిన డ్రెస్‌ని మళ్లీ మళ్లీ వేసుకుంటాడని.. అవే చేతులతో వంట చేస్తున్నాడని మండిపడింది. దానికి హరీష్ కౌంటర్ ఇస్తూ.. నాకు నాలుగు రోజుల నుంచి బట్టలు రావడం లేదని అందుకే ఒకటే హుడీ వేసుకుని తిరుగుతున్నానని చెప్పాడు. కానీ వంట మాత్రం శుభ్రంగానే చేసిపెడుతున్నానని, హౌస్‌లో వాళ్లను ఎవరినైనా అడగొచ్చని ఆన్సర్ ఇచ్చాడు. అనంతరం సంజనను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు నాగార్జున. అందరూ కాసేపు షాక్‌లో ఉండగా.. ఆ వెంటనే సంజనను మరోసారి వెనక్కి పిలిచాడు నాగ్.
రీతూ, తనూజల త్యాగం
సంజన మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారా? అని నాగార్జున అడగ్గా.. కంటెస్టెంట్స్ అంతా కావాలని చెప్పారు. అయితే ఆమె కోసం కొన్ని త్యాగాలు చేస్తూ ఆమెకు రీఛార్జ్ పెరిగి హౌస్‌లోకి రావడానికి అర్హత వస్తుందని చెబుతాడు నాగార్జున. తొలుత తనూజ పుట్టస్వామిని లేపి నువ్వు సంజన రీ ఎంట్రీ కోసం ఏం త్యాగం చేస్తావని అడుగుతాడు నాగ్. నీకు ఎంతో ఇష్టమైనా కాఫీని బిగ్‌బాస్‌లో ఉన్నంత కాలం తాగకుండా ఉండాలని కండీషన్ పెట్టాడు. కాఫీ లేకుండా ఉండలేని తనూజ.. ఎంతో బాధపడుతూ కాఫీని త్యాగం చేసింది. దాంతో సంజనకు 25 శాతం ఛార్జీంగ్ లభించింది. ఆ తర్వాత రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకుంటానని ముందుకు వచ్చింది. ఎంతో ఇష్టమైన హెయిర్‌ను దివ్య కట్ చేస్తుంటే రీతూ కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆదివారం సంజన హౌస్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











