‘16 ఏళ్ల అమ్మాయిలు ఇండస్ట్రీకి రావొద్దు... టాప్ ప్రొడ్యూసర్ చేతిలో అలా మోసపోయా’

బుజ్జిగాడు సినిమాతో తెలుగువారిని పలకరించారు కన్నడ కస్తూరి సంజన గల్రానీ. అనంతరం సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలలో నటించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది సంజన గల్రానీ. అయితే సినిమాలలో కంటే వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలిచేవారు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన సంజన.. ఇటీవల తెలుగు బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టి ఫైనలిస్ట్‌గా నిలిచారు. బుల్లితెరపై సీరియల్ ద్వారా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోకు హాజరైన సంజన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

మీ బాబు ఎట్లా ఉన్నాడని వర్ష అడగ్గా.. ఇమ్మాన్యుయేలా? చాలా బాగున్నాడు. అతను చాలా సక్సెస్‌లో ఉన్నాడు, అతనికి ఓ హిట్ పడితే బ్రహ్మానందం గారి స్థానంలో పోతాడని సంజన చెప్పింది. నేను డబ్బుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తా.. సాంప్రదాయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా. నేనొక కెమెరాలో కొనాలంటే ఒక అమౌంట్ తీసుకుని ఛాట్ జీపీటీలో వేసి చీప్‌గా ఏది దొరుకుతుందో తెలుసుకుంటా. నాకు పిల్లలున్నారు.. వాళ్లు పెరిగిన తర్వాత ఏం చేశావు మా కోసం? 100 రూపాయలు పెట్టావా? అని అడిగితే నేను ఏం చెప్పాలి అని సంజన ప్రశ్నించింది.

Sanjjanaa Galrani Emotional Comments on Drugs Case Bigg Boss Journey and Film Career Struggles

బావగారు.. ప్రభాస్ గారు ఎలా ఉన్నారని వర్ష అడగ్గా.. ఆయన చాలా బాగున్నారని చెప్పింది సంజన. నేను ఏదైనా డ్రెస్ వేసుకుంటే చెండాలంగా ఉందని చెప్పకూడదు. నేను వన్ బీహెచ్‌కే ఇంటి నుంచి వచ్చాను.. నా బిల్స్ కట్టుకోవాలి, అమ్మానాన్నల్ని, చెల్లెల్ని చూసుకోవాలి. నేను ఇది చేయలేదంటే నా కెరీర్ ఫినిష్ అయిపోతదా? ఇంకో మూవీ వస్తుందో లేదో? గ్యాప్ వచ్చేస్తుందా? నన్ను ఇండస్ట్రీ మరిచిపోతుందా? అలాంటి భయాలతో చాలా రాంగ్ రోల్స్ చేశాను. ఆ సినిమాలు చూస్తే నాకు నా మీదే జాలేస్తుంది. ప్రెస్‌మీట్‌లో కూర్చొంటే నాకు తెలియకుండానే మోకాళ్ల వరకు ఉన్న ఫోటోలు తీస్తారు.. అవి వైరల్ అవుతాయని సంజన తెలిపారు.

ఫిల్మ్ ఇండస్ట్రీకి 16, 17, 18, 19 ఏళ్ల వయసులో రావొద్దు.. తొలి సినిమా డిస్కషన్‌లో పాల్గొనడానికి డబ్బులు మిగులుద్దామని హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లా, తర్వాత హాఫ్ ఆటోలో పోయాను. సేవ్ చేసి.. చేసి 2 కోట్లు వరకు ఇచ్చి ఇరుక్కుపోయా, అతను తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఇక నా జీవితంలో లవ్ అంటే మీనింగే లేదు.. ఏదో చిప్స్ ప్యాకెట్‌లా కనిపిస్తుంది. ఒక రోజు టమోటా ఫ్లేవర్ కావాలి, ఇంకో రోజు లెమన్ ఫ్లేవర్ కావాలి, ఇప్పుడు జనరేషన్‌ని చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. మంచి వైపు నడిస్తే నాకన్నీ మంచే జరుగుతాయి.. ఎవరికైనా 10 శాతం నాశనం చేస్తే అది 10 వేల సార్లు మనకే తగులుతుందని సంజనా హెచ్చరించారు.

సంజన ఈరోజు నవ్వుతున్నారు కానీ.. జైలుకు కూడా వెళ్లొచ్చారని వర్ష ప్రశ్నించగా... అది నాకు చావుతో సమానం. ఆ వివాదంలోకి నన్ను లాగి బలి పశువుని చేశారు. శత్రువుకి కూడా అలాంటి పరిస్ధితి రావొద్దు.. చావు అంచుల వరకు వెళ్లి బతికొచ్చా. మందు, డ్రగ్స్‌లోకి లాగారు.. నిను మూడున్నర నెలలు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాను అక్కడ నాలో వ్యసనాలు కనిపించాయా అని సంజన ప్రశ్నించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి పోయేముందు అందరూ తిడుతున్నారు. నా భర్త కూడా నేను లోపలికి వెళ్లేముందు నీకు ఏమైనా పిచ్చా.. పాపకి 5 నెలలు నిండలేదని తిట్టారు. నా మీద పడ్డ నింద తీయడానికే నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని చెబితే ఎవ్వరూ అర్ధం చేసుకోలేదు. మా అమ్మ ఇలా బతికిందని ఏ బిడ్డకి చెప్పకూడదు.. ఒక తల్లిగా బతకలేమని సంజన ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా .. సంజన ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఈ శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X