బిగ్‌బాస్‌ తెలుగు 9లో ఊహించని ట్విస్ట్.. సంజనా గల్రానీకి సుప్రీంకోర్ట్ నోటీసులు

బిగ్‌బాస్ తెలుగు 9 ఊహించని ట్విస్టులతో, గొడవలతో హాట్ హాట్‌గా సాగిపోతోంది. రెండు వారాలుగా కామనర్స్ vs సెలబ్రిటీస్ అన్నట్లుగా పరిస్ధితులు నెలకొన్నాయి. ఎవ్వరికీ ఎవ్వరూ తగ్గకుండా గేమ్స్ అయినా, టాస్క్‌లైనా, డిస్కషన్స్ అయినా రెచ్చిపోతున్నారు. అయితే ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌పై కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారు సంజన గల్రానీ. చాలా సింపుల్‌గా నవ్వేస్తూ, బబుల్ గమ్ నమిలిస్తూ స్ట్రాటజీతో వెళ్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి నేటి వరకు బిగ్‌బాస్ హౌస్ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది.

బిగ్‌బాస్ హౌస్ ఆమె చుట్టూనే
బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైన తర్వాత సంజన గల్రానీ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉంటుందా? అన్న అనుమానాలు కనిపించాయి. పెద్ద వయసు కావడంతో పాటు తెలుగు అంతంత మాత్రంగా రావడంతో కుర్రాళ్ల దెబ్బకు సంజనను ఇంటికి పంపించేస్తారని అనుకున్నారు. లేదా వీళ్ల దెబ్బకి ఆవిడే వెళ్లిపోతుందని వార్తలు వచ్చాయి. కానీ కట్ చేస్తే ఆ తెల్లారి నుంచే హౌస్‌ను తన చుట్టూ తిప్పుకోవడం మొదలుపెట్టారు సంజన. కామనర్స్ ఫుడ్ పెట్టకపోవడంతో గుడ్డు దొంగతనం చేసి పెంట మొదలు పెట్టింది.

Sanjjanaa Galrani Supreme Court Issued notices to bigg Boss Telugu 9 contestant

తొలి కెప్టెన్‌గా
ఆవిడ గుడ్డు కోసం మిగతా ఇంటి సభ్యులంతా గొడవ పెట్టుకుంటుంటే సంజన మాత్రం ఓ మూల కూర్చొని సినిమా చేసింది. ఆ తర్వాత తన మైండ్ గేమ్ , స్ట్రాటజీతో ఏకంగా బిగ్‌బాస్ తెలుగు 9కి తొలి కెప్టెన్‌గా నిలిచింది సంజన గల్రానీ. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచిన ఆమె.. ఈసారి ఖచ్చితంగా విజేతగా నిలిచేవారిలో ఒకరిగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ వారం మిడ్‌వీక్ ఎవిక్షన్ అంటూ బిగ్‌బాస్ బాంబు పేల్చి ఆమెను ఇంటికి పంపినట్లు పంపి సీక్రెట్‌ రూమ్‌లో సెట్ చేశాడు. అక్కడి నుంచి అందరి ఆటను గమనిస్తూ.. తిరిగి మళ్లీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తుందని సంజన అభిమానులు భావిస్తున్నారు.

సంజనకు సుప్రీం నోటీసులు
ఈలోపు సంజనకు, బిగ్‌బాస్ నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ నుంచి ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. ఆ సమయంలో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ కేసులో సంజనను ఏ 14గా చేర్చారు పోలీసులు.. దాదాపు 2 నెలల పాటు జైలులోనే గడిపిన ఈమె అనంతరం బెయిల్ రావడంతో విడుదలయ్యారు. నాలుగేళ్ల తర్వాత 2024 మార్చి 25న కర్ణాటక హైకోర్ట్ ఈ కేసును పలు కారణాలతో రద్దు చేసింది.

కుదిపేసిన ఆ కేసు
దీంతో సంజన సహా ఈ కేసులో ఉన్నవారు ఊపిరీ పీల్చుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం ఈ డ్రగ్స్ కేసును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని సంజనకు నోటీసులు జారీ చేసింది. ఈసారి సుప్రీం జోక్యంతో కేసును వేగంగా, సీరియస్‌గా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9లో స్టార్‌గా దూసుకెళ్తున్న సంజనకు ఈ కేసు కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X