భర్తకు గుడ్‌బై చెప్పిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. రెండో పెళ్లికి సిద్ధమైన టీవీ నటి..
పాపులర్ టీవీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సారా ఖాన్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల ఓ షో సందర్భంగా తాను వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. బిగ్‌బాస్‌తోపాటు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు, వీడియోలతో ఆకర్షించే ఈ భామ ఎవరి వివాహం చేసుకోబోతున్నదో అనే విషయాన్ని గుప్తంగా ఉంచారు. అయితే ఇప్పటికే పెళ్లి చేసుకొన్న ఈ భామ మళ్లీ రెండో పెళ్లికి సిద్ధం కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

సంచలనాలకు సారా ఖాన్ మారు పేరు
సారా ఖాన్ సంచలనాలకు మారు పేరు. ఘాటైన వ్యాఖ్యలు, చేష్టలతో సోషల్ మీడియాను వేడిక్కిస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన న్యూడ్ వీడియో లీక్ కావడంతో మరోసారి అందరి దృష్టిలో పడింది. అయితే తాను లీక్ చేయలేదని వివరణ ఇచ్చినప్పటికీ.. ఆ పని ఆమె చేసి ఉంటుందనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. ఇలా షాకుల మీద షాకులిస్తున్న సారా ఖాన్ తన పెళ్లి గురించి బాంబు పేల్చింది.

వంటల కార్యక్రమంలో పెళ్లి న్యూస్
సారా ఖాన్ తన సోదరితో కలిసి ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాటల్లో పడి తన మనసులోనే కోరికను బయటపెట్టారు. అయితే పెళ్లి ప్లాన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని హింట్ ఇచ్చారు. అయితే ఎప్పుడు, ఎక్కడ పెళ్లి అనే విషయాన్ని చెప్పడానికి నిరాకరించారు. పలు ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.

బిగ్ బాస్ సీజన్ 4లో పెళ్లి
బిగ్‌బాస్ సీజన్ 4 సందర్భంగా సారాఖాన్ తన తోటి కంటెస్టెంట్ అలీ మర్చంట్‌ను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఒంటిరిగానే ఉంటున్నారు. అయితే మరో టీవీ నటుడు అంకిత్ గేరాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.

బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తూ
అయితే తాను అంకిత్ గేరాతో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. కానీ ఆ వార్తలు అంతటితో ఆగలేదు. ఆ తర్వాత వారిద్దరు సన్నిహితంగా ఉంటూ మీడియా కంటపడటంతో రూమర్లకు బలం చేకూరింది. అయితే అంకిత్‌తో ఉన్న రిలేషన్‌ను బయటపెట్టడానికి నిరాకరించారు. అయితే తాజాగా తన పెళ్లి వార్తను బయటపెట్టడంతో అంకిత్‌తోనే పెళ్లి అనే మాట బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











