India
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss OTT: షోలోకి వివాదాస్పద నటి ఎంట్రీ.. పోలీస్ కేస్ తర్వాత ఊహించని విధంగా!

    |

    బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా రూపొంది.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. మొదట హిందీలో వచ్చిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులోకి కూడా వచ్చింది. అన్ని భాషలతో పోలిస్తే మన దగ్గర మాత్రమే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది.

    ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో ఓ వివాదాస్పద నటి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇంతకీ ఎవరామె? ఆ సంగతులేంటో మీరూ చూడండి!

    బిగ్ బాస్ సరికొత్త ప్రయోగాలతో

    బిగ్ బాస్ సరికొత్త ప్రయోగాలతో

    అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైనా.. తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ మాత్రమే దేశంలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ జోష్‌తోనే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్‌ను తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్వహకులు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు.

    ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

    ఆ ఓటీటీలో రోజంతా ప్రసారమే

    ఆ ఓటీటీలో రోజంతా ప్రసారమే

    గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను హిందీ నిర్వహకులు ప్రయోగాత్మకంగా మొదలెట్టారు. అక్కడ ఇది సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకు వస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ షో మాదిరిగా టీవీలో కాకుండా.. కేవలం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు అందులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

    చివరి దశకు చేరిన ఓటీటీ వర్క్

    చివరి దశకు చేరిన ఓటీటీ వర్క్

    తెలుగులో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదటి సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులూ చివరికి వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా సెట్ వర్క్‌ను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేశారని తెలిసింది. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైపోయిందని అంటున్నారు.

    హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ

    ఓటీటీ వెర్షన్.. పూర్తి వివరాలివే

    ఓటీటీ వెర్షన్.. పూర్తి వివరాలివే

    బుల్లితెర నుంచి అందుతోన్న వివరాల ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగబోతుందని తెలిసింది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన అధికారిక లిస్ట్ కూడా వచ్చేసిందని టాక్.

     ఓటీటీలోకి వాళ్లు కూడా ఎంట్రీ

    ఓటీటీలోకి వాళ్లు కూడా ఎంట్రీ

    ప్రయోగాత్మకంగా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీని గురించి ఎన్నో రకాల వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక, ఇందులో చాలా మంది మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో పలువురిని ఎంపిక కూడా చేశారని ప్రచారం జరుగుతోంది.

    టాప్ లేపి చూపించిన నందినీ రాయ్: అద్దం ముందు హాట్ హాట్ ఫోజుతో రచ్చ

    బిగ్ బాస్‌లోకి వివాదాస్పద నటి

    బిగ్ బాస్‌లోకి వివాదాస్పద నటి

    డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త ప్లాన్లు చేస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే వివాదాస్పద నటి సరయు రాయ్‌ను కూడా ఎంపిక చేసుకున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

    పోలీస్ కేసు తర్వాత బిగ్ ఆఫర్

    పోలీస్ కేసు తర్వాత బిగ్ ఆఫర్

    బోల్డు వీడియోలతో ఫేమస్ అయిన సరయు రాయ్.. ఐదో సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారమే ఎలిమినేట్ అయింది. ఇక, ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయింది. దీని తర్వాత బిగ్ బాస్ నిర్వహకులు ఆమె పేరు తొలగించాలని అనుకున్నారని తాజాగా తెలిసింది. కానీ, అది పరిష్కారం అవడంతో షోలోకి తీసుకు వస్తున్నారని సమాచారం.

    English summary
    Bigg Boss Show Completed Five Seasons Successfully. Now Makers Planing for OTT Season. Recently BB Team Approached Sarayu Roy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X