India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఎంట్రీ ఇస్తూనే షాకిచ్చిన సరయు.. వాళ్లే ఎలిమినేట్ చేశారంటూ!

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది బిగ్ బాస్. మొదట హిందీలో వచ్చిన ఈ రియాలిటీ షో.. ఆ తర్వాత చాలా భాషల్లోకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులోకి కూడా వచ్చింది. అన్ని భాషలతో పోలిస్తే మన దగ్గర మాత్రమే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కింది.

  ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్రారంభించారు. తాజాగా మొదలైన ఇందులోకి కాంట్రవర్శీ క్వీన్ సరయు ఎంట్రీ ఇచ్చింది. రావడమే బిగ్ బాస్‌పై నిందలు వేసింది. ఆ సంగతులు మీకోసం!

  అందులోనే ప్రసారం అవుతోన్న సీజన్

  అందులోనే ప్రసారం అవుతోన్న సీజన్

  బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' ఈరోజే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, ఇందులో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని యూనిట్ ముందుగానే వెల్లడించింది. ఇక, ఈ సీజన్‌ను బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

  Bheemla Nayak Collections: భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు.. పవన్ దెబ్బకు పుష్ప, బాహుబలి వెనక్కే!

  అంగరంగ వైభవంగా నాన్ స్టాప్ సీజన్

  అంగరంగ వైభవంగా నాన్ స్టాప్ సీజన్

  బిగ్ బాస్ ప్రియులు ఎంతో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఎన్నో ఊహాగానాలు, అంచనాల నడుమ ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను తాజాగా ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి.. అన్ని ప్రదేశాలనూ ప్రేక్షకులకు చూపించారు.

  ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు ఎవరంటే

  ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు ఎవరంటే

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. షోలోకి ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ ఎంట్రీ ఇచ్చారు.

  మితిమీరిన హీరోయిన్ హాట్ షో: లోపలివి కూడా కనిపించేలా.. అసలు ఇది డ్రెస్సెనా!

  సరయు రాయ్ ఎంట్రీ.. కొడ్తా అంటూ

  సరయు రాయ్ ఎంట్రీ.. కొడ్తా అంటూ

  యూట్యూబ్‌లో బోల్డు వీడియోలతో ఫేమస్ అయిన సరయు రాయ్.. బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లి గౌను వేసుకుని వచ్చిన ఈ భామ గని సినిమాలోని కోడ్తె పాటకు స్టెప్పులు వేసింది. తన ఆటపాటలతో అలరించిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత స్టేజ్‌పై అక్కినేని నాగార్జునకు హగ్ ఇచ్చి మరీ తనను మళ్లీ పరిచయం చేసుకుంది.

  వాళ్లే ఎలిమినేట్ చేశారంటూ షాకింగ్‌గా

  వాళ్లే ఎలిమినేట్ చేశారంటూ షాకింగ్‌గా

  డ్యాన్స్ చేసిన తర్వాత అక్కినేని నాగార్జునతో మాట్లాడుతూ.. 'లాస్ట్ సీజన్‌లో ఒక్క వారం మాత్రమే ఉన్నాను. కావాలనే నన్ను ఎలిమినేట్ చేసేశారు. అప్పుడు నా ఫైర్‌ను ఎవరికీ చూపించలేకపోయాను. కానీ, ఇప్పుడు కచ్చితంగా చూపిస్తాను' అంటూ సవాల్ విసిరింది. దీంతో నాగార్జున 'నిన్ను ఎవరూ పంపలేదమ్మా.. అలా జరిగిపోయింది' అని వివరణ ఇచ్చాడు.

  Bigg Boss Non Stop: షో ప్రారంభానికి ముందు బిగ్ షాక్.. చివరి నిమిషంలో తప్పుకున్న కంటెస్టెంట్

  ఒక్క వారంలో ఎలిమినేట్.. అరెస్ట్ కూడా

  ఒక్క వారంలో ఎలిమినేట్.. అరెస్ట్ కూడా

  సరయు రాయ్ ఐదో సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారమే ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు కూడా చేసింది. ఇక, ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుని అరెస్ట్ అయింది. దీని తర్వాత బిగ్ బాస్ నిర్వహకులు ఆమె పేరు తొలగించాలని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడామె షోలోకి ఎంటర్ అయింది.

  English summary
  Bigg Boss Telugu Unit Now Started Non Stop OTT Season. Sarayu Roy Entered into as 13th Contestant.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X