For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోనూ సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్. కొంత మంది కంటెస్టెంట్లను హౌస్‌లో ఉంచి.. ప్రేక్షకుల మనసు దోచుకున్న వాళ్లను విజేతగా ప్రకటించే ఇది.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. అలా కొన్నేళ్ల క్రితం తెలుగులోనూ పరిచయం అయింది. అయితే, అన్నింటి కంటే మన దగ్గర వస్తున్న షోకు మాత్రమే రెస్పాన్స్ భారీగా దక్కుతోంది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. అందుకే ఇప్పుడు నిర్వహకులు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' సీజన్‌ను మొదలు పెట్టారు. ఇది ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో రియల్ ఫైట్ జరిగింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  బిగ్ బాస్ నాన్ స్టాప్ వివరాలివే

  బిగ్ బాస్ నాన్ స్టాప్ వివరాలివే


  'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ రెండు వారాల క్రితమే మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కాబోతుంది. ఈ సీజన్‌లో ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజంతా ప్రసారాన్ని ఆపేశారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేసి దీన్ని మళ్లీ మొదలు పెట్టేశారు.

  హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

  చాలెంజర్స్ వర్సెస్ వారియర్స్

  చాలెంజర్స్ వర్సెస్ వారియర్స్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా కొత్త వాళ్లతో పాటు మాజీలు కూడా వచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త కంటెస్టెంట్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విడదీశారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతూ ఫైటింగ్‌కు దారి తీస్తోంది.

  కంటెస్టెంట్లకు తగ్గేదేలే టాస్కు

  కంటెస్టెంట్లకు తగ్గేదేలే టాస్కు

  రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ 'తగ్గేదేలే' టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. వారియర్స్ టీం సభ్యులు స్మగ్లర్స్‌గా.. ఛాలెంజర్స్ టీ సభ్యులు పోలీసులుగా మారారు. పోలీసుల కళ్లు కప్పి ఇంట్లో బొమ్మల్ని చెక్‌పోస్ట్ దాటించాల్సి ఉంటుంది. పోలీసులు వాళ్లను అడ్డుకోవాలి. ఇలా మొదటిగా ఎవరు టార్గెట్‌ని రీచ్ అవుతారో వాళ్లే ఈ టాస్కులో గెలిచినట్టు.

  హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

  టాస్కును పూర్తి చేసిన మాజీలు

  టాస్కును పూర్తి చేసిన మాజీలు

  'తగ్గేదేలే' టాస్కులో భాగంగా చెక్క బొమ్మలను స్మగ్లింగ్ చేయడానికి వారియర్స్.. వాటిని అడ్డుకునేందుకు చాలెంజర్లు తెగ పోటీ పడ్డారు. బయట ఉన్న బాక్సుల్లోకి చెక్కలు రాకుండా అడ్డుకునేందుకు చాలెంజర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య పలు రకాల గొడవలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే వారియర్స్ ఈ టాస్కును పూర్తి చేసుకున్నారు.

  పాత్రలను మార్చిన బిగ్ బాస్

  పాత్రలను మార్చిన బిగ్ బాస్

  మొదటి రౌండ్‌లో భాగంగా వారియర్స్‌ను స్మగ్లర్లుగా చేయమన్న బిగ్ బాస్.. రెండో రౌండ్‌లో వాళ్ల పాత్రలను మార్చేశాడు. దీంతో చాలెంజర్లు స్మగ్లర్లుగా.. వారియర్స్ పోలీసులుగా మారారు. ఇక, చెక్కలు చెక్‌పోస్ట్ దాటకుండా ఉండేందుకు బ్లాంకెట్లను డోర్‌కు అడ్డంగా పెట్టారు. ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. అయినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు.

  ఘాటు ఫోజుతో కాజల్ అగర్వాల్ హాట్ ట్రీట్: ప్రెగ్నెంట్ అయినా అస్సలు తగ్గకుండా!

  సరయుపై శ్రీ రాపాక దాడి చేసి

  సరయుపై శ్రీ రాపాక దాడి చేసి

  ఈ టాస్కులో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఆరియానా గ్లోరి.. లోపలి నుంచి వస్తున్నట్లు నటించి స్మగ్లర్‌గా ఉన్న శ్రీ రాపాకను గేట్ వైపు తోసేసింది. దీంతో ఆమె అక్కడే కింద పడిపోయింది. అప్పుడు అందరూ ఆమె దగ్గర ఉన్న చెక్క బొమ్మలను లాక్కున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన శ్రీ రాపాక తన దగ్గర మిగిలి ఉన్న చెక్కలను వారియర్స్‌పై విసిరింది. దీంతో సరయుకు గాయమైంది.

  బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్

  బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్


  శ్రీ రాపాక విసిరిన చెక్క బొమ్మ సరయుకు బలంగా తగిలింది. దీంతో వారియర్స్ బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశారు. ఫలితంగా ఆయన టాస్కును ఆపేసి అందరినీ సోఫా దగ్గర కూర్చోమని చెప్పాడు. అనంతరం 'బిగ్ బాస్ హౌస్‌లో హింస ఉండకూడదు. మరోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు' అంటూ అందరికీ సీరియర్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ కంటిన్యూ అయింది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. In Recent Episode.. Sarayu Roy Was Injured in Thaggedele Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X