హాట్ షోతో రెచ్చిపోయిన బిగ్ బాస్ సరయు: పైటను పక్కకు జరిపి మరీ ఘోరంగా!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తెలుగు అమ్మాయిలు విపరీతంగా ఫేమస్ అయిపోయారు. తమ తమ రంగాల్లో అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. కానీ, కొందరు మాత్రం బోల్డుగా ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్ సరయు రాయ్ ఒకరు. అడల్ట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తూ గుర్తింపును దక్కించుకున్న ఆమె.. బిగ్ బాస్ రెండు సీజన్లలో పాల్గొనడంతో మరింత క్రేజ్‌ను అందుకుంది.
దీంతో మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సరయు రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

బోల్డు వీడియోలతో ఫుల్ ఫేమస్
బోల్డు బ్యూటీ సరయు రాయ్ యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అంతలా ఈ బ్యూటీ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

వివాదాలు వచ్చినా తగ్గట్లేదుగా
యూట్యూబ్‌లో సరయు రాయ్ అండ్ టీమ్ చేసే వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన ఓ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత అలాంటివే చాలా వీడియోలపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇక, ఇటీవలే ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది.

బిగ్ బాస్ ఛాన్స్.. వారానికే ఔట్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బోల్డు బ్యూటీ సరయు కూడా ఉంది. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. బూతులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే ఐదో సీజన్‌లో భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చేసింది. అయితే, మొదటి వారమే ఆమె ఎలిమినేట్ అయింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్.. మళ్లీ ఔట్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అనూహ్యంగా ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిన సరయు రాయ్.. తాజాగా వస్తున్న నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కూడా కంటెస్టెంట్‌గా వచ్చింది. ఇందులో మాత్రం చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఆరంభంలోనే కాకుండా ఐదు వారాల పాటు అందులో సందడి చేసింది. కానీ, మిగిలిన వాళ్ల కంటే తక్కువ ఓట్లు రావడంతో మళ్లీ ఎలిమినేట్ అయింది.

అక్కడ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ
సోషల్ మీడియాలో సరయు రాయ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ బాగా పెరుగుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది
సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సందడి చేస్తోంది సరయు రాయ్. ఆమె షేర్ చేస్తోన్న ఫొటోల్లో ఎక్కువగా అందాల విందు చేస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉండేవి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సరయు రాయ్ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

హాట్ సెల్ఫీతో రచ్చ చేస్తోంది
సరయు రాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











