టీవీ సింగింగ్ షో: నిర్మాతపై ఫైనలిస్ట్ కేసు

సినిమా రంగంలో మాదిరి ఈ రంగంలోనూ పలు వివాదాలు, గొడవలు సర్వ సాధారణమే. నిర్మాత డబ్బులు ఎగ్గొట్టాడని కొందరు, తన రాల్సిన అవకాశం ఇంకొకరికి ఇచ్చారంటూ కలహాలు ఈ మధ్య కామన్ అయిపోయాయి. తాజాగా ఓ హిందీ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న అభ్యర్థి సదరు షో నిర్మాతపై కేసు వేసింది.
వివరాల్లోకి వెళితే.... హిందీలో 'సా రె గా మా పా' పేరుతో రూపొందుతున్న సింగింగ్ టాలెంట్ రియాల్టీషో ఫైనలిస్టు హిమాని కపూర్ ఆ షో నిర్మాతలపై కేసు వేసింది. నిర్మాతలు తనకు రూ. 2 కోట్ల వరకు బాకీ ఉన్నారని 'ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్'లో ఫిర్యాదు చేసింది.
ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ దినేష్ చతుర్వేది ఈ విషయమై స్పందిస్తూ.... సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఈ ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











