ఐసీయూలో టీవీ నటుడు.. సాయం చేయండి అంటూ దీనంగా విన్నపం

హిందీ వినోద పరిశ్రమలో పలు పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ రాయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హాస్పిటల్‌కు తరలించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ముంబైలోని ఓ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆర్థికంగా చితికిపోయిన ఈ నటుడు తనకు సహాయం అందించాలని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వేడుకొన్నాడు.

నటుడు ఆశీష్ రాయ్ తన ఫేస్‌బుక్‌లో.. నేను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. డయాలిసిస్ చికిత్స జరుగుతున్నది. ఆ చికిత్స కోసం డబ్బులు అవసరం ఉంది. దయచేసి నాకు ఆర్థిక సహాయం అందించండి అంటూ ఓ పోస్టు పెట్టారు.

ఆశీష్ రాయ్ పెట్టిన పోస్టుకు విశేషమైన స్పందన లభిస్తున్నది. మీరు త్వరగా కోలుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలియజేయండి అంటూ చాలా మంది స్పందించారు. తమకు తోచిన విధంగా సాయం అందించినట్టు తెలుస్తున్నది.

Sasural Simar Ka actor Ashiesh Roy hospitalised

ఇదిలా ఉండగా, ఆశీష్ రాయ్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన సన్నిహితులు వైద్యం కోసం అవసరమయ్యే డబ్బును కొంత సమకూర్చినట్టు తెలిసింది.

ఇక ఆశీష్ రాయ్ కెరీర్ విషయానికి వస్తే.. కుచ్ రంగ్ ప్యార్ కే ఐసీ భీ, ససురాల్ సిమర్ కా, బ్యోమకేష్ బక్షి లాంటి సిరియల్స్ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X