Dhee 17 Finale ఆ రోజే నా డెత్ డేట్.. హైపర్ ఆది బిస్కెట్ దిమ్మతిరిగేలా కాజల్!
ఇండియాలో టాప్ మోస్ట్ రేటింగ్ ఉన్న డ్యాన్స్ రియాలిటీ షో ఢీ. ఎన్నో ఏళ్లుగా అనేక మంది అభిమానులను ఆకట్టుకొంటున్న ఈ షో ప్రస్తుతం 17వ సీజన్ పూర్తి చేసుకోబోతున్నది. ఈ సీజన్‌లో దాదాపు తుది అంకానికి చేరుకొన్నది. 17వ సీజన్ ఢీ షోలో ప్రస్తుతం రేస్ టూ ఫినాలే జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటుకొని విజేతగా నిలువడానికి పలు టీమ్‌లో శ్రమించాయి. టాప్ రేటింగ్ షోగా పేరు తెచ్చుకొన్న ఢీ షోకు టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ కార్యక్రమంలో సత్యభామ చేసిన హంగామా గురించిన వివరాల్లోకి వెళితే..
కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా మే 31వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఢీ షోను వేదికగా చేసుకొన్నది. అయితే ఢీ షోలో కాజల్ తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు.

కాజల్ అగర్వాల్, హైపర్ ఆది మధ్య సైటర్స్, ఫన్ షోను మరింత వైబ్రంట్‌గా మార్చాయి. అక్టోబర్ 30 నీ మ్యారేజ్ డే కదా.. అంటే అవును అని కాజల్ సమాధానం ఇచ్చింది. దాంతో ఆ రోజు నా డెత్ డేట్.. అని కామెంట్ చేశాడు. దాంతో ఆమె నవ్వుల్లో మునిగిపోయింది. ఆ తర్వాత పెళ్లికి ముందు కాజల్‌ను ఊహించుకొని.. ఎన్నో కవితలు రాశాను అని ఆది అంటే.. పెళ్లి తర్వాత అని ప్రశ్న వేస్తే.. నేను కిచ్లూ బాధితుడిని అంటూ కాజల్‌కు జవాబిచ్చాడు.

అయితే ఇక తర్వాత శేఖర్ మాస్టర్‌తో కలిసి బాద్షా చిత్రంలోని కొట్టినా.. తాళి బొట్టు కట్టినా.. నువ్వు నాకు నచ్చినోడివే.. రాంజీ పాటపై స్టెప్పులు వేసింది. అలాగే మగధీర చిత్రంలోని పాట పాడుతూ కాజల్‌కు ఆది లైన్ వేసే ప్రయత్నం వేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. కాజల్‌ను చూసి గాలి నిన్ను తాకింగి.. నేల కూడా తాకింది.. నేను తాకితే తప్పా అంటూ పాట అందుకొంటే.. గాలి ఊపిరి అయింది.. నేల నన్ను నడిపింది.. అందులో నీ గొప్ప ఏమిటి? అంటూ పంచ్ వేసింది.
ఇక ఢీ 17 ఫినాలేకు వెళ్లేందుకు డ్యాన్సర్లు తమ శక్తి మంచి ప్రదర్శన చేశారు. కాజల్‌ను ఆకట్టుకోవడమే కాకుండా ఫినాలేకు అర్హులం అంటూ తమ స్టెప్పులతో స్టేజ్‌ను దద్దరిల్లేలా చేశారు. ఇక వారి ప్రతిభను చూసి కాజల్ మైండ్ బ్లోయింగ్.. నా కళ్లను మీ డ్యాన్స్ స్టెప్పుల నుంచి తీప్పులేకపోయాను అంటూ ప్రశంసలు కురిపించింది. త్వరలోనే ఈ షో పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానున్నది.


Click it and Unblock the Notifications











