బిగ్ బాస్ లోకి సావిత్రి.. ఫస్ట్ పార్టిసిపెంట్.. ట్రంకు పెట్టె పట్టుకొని వచ్చేసింది
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో మొదటి కంటిస్టెంట్ గా V6 సావిత్రి అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. ఆమె గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు. అక్క అంటూ పలకరించి.. నీ వార్తలు మాతుగుంటాయి అక్క అని నాగ్ అన్నారు.

యాంకర్ సావిత్రి.. సాధారణంగా ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. V6 ఛానల్ లో ప్రసారమవుతున్న తీన్మార్ వార్తల ద్వారా బాగా ఫేమస్ అయింది సావిత్రి. బులితెరపై సావిత్రి ముచ్చట మొదలైంటే చాలు చిన్న, పెద్ద అందరూ టీవీకే అతుక్కుపోతుంటారు. అగొ సూడుర్రి.. అయ్యో గట్లయిందట అంటూ కడుపుబ్బా నవ్విస్తూనే వార్తలు చేరవేస్తుంటుంది సావిత్రి. అలా అత్యంత ప్రజాధారణ పొందిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేసింది. ఈమె అసలు పేరు జ్యోతి. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో జన్మించింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఈమె వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. ఇక 100 రోజుల పాటు తన తెలంగాణ యాసతో బిగ్ బాస్ ను చిందర వందర చేస్తుందేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











