twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిరిని ఎలిమినేట్ చేయాలన్న షన్ను తల్లి.. పిచ్చోడయ్యేవాడు అంటూ ప్రియుడు సంచలనం… పోస్టులు పెట్టి డిలీట్!

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఈ ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్, సిరి ఇద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే తాజాగా సిరి ప్రియుడు శ్రీహాన్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టి డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     జుగుప్సాకరంగా

    జుగుప్సాకరంగా

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరి, హనుమంతు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి వీళ్ళిద్దరూ హగ్గులు ఇచ్చుకుంటున్న వ్యవహారం చూసి స్వయంగా సిరి తల్లి ఇదేమి బాలేదు అంటూ షో వేదికగా వెల్లడించింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో స్వయంగా తల్లిని కించపరిచే విధంగా మాట్లాడిన సిరి ఆ తర్వాత హగ్స్ ఇచ్చుకుంటూ ఇది ఫ్రెండ్షిప్ హగ్ అని చెప్పి మరీ మరింత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోంది. అయితే లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ బయట మాత్రం షణ్ముఖ్ జస్వంత్, సిరి కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు.

    పోస్టులు పెట్టి డిలీట్

    పోస్టులు పెట్టి డిలీట్

    తాజాగా సిరి ప్రియుడు శ్రీహాన్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని పోస్టులు పెట్టి డిలీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. షణ్ముఖ్ జస్వంత్ సిరి హనుమంతు ఇద్దరూ ఒకరి వల్ల ఒకరు చెడ్డ పేరు తెచ్చుకున్న సంగతి మనకు అర్థమవుతుంది. షణ్ముఖ్ యశ్వంత్ ని అభిమానించే వాళ్ళు సిరి వల్ల షణ్ముఖ్ జస్వంత్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు, అని సిరిని అభిమానించే వాళ్ళు షణ్ముఖ్ జస్వంత్ వల్ల సిరి పేరు తెచ్చుకుంటోంది అని భావిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అయినా తాజాగా శ్రీహన్ తన ప్రియురాలిని వెనకేసుకు వస్తూ కొన్ని పోస్టులు పెట్టారు.

    ఎలాంటి పోస్టులు పెట్టలేదు

    ఎలాంటి పోస్టులు పెట్టలేదు

    శ్రీ హాన్ పెట్టిన పోస్టులు యధాతధంగా ''ఒక అమ్మాయి క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తూ పోస్టులు పెట్టడం లోనే తెలుస్తోంది వాళ్ళ మెచ్యూరిటీ, ఒక స్క్రీన్ షాట్ నా దగ్గరికి కూడా వచ్చి పది రోజులు దాటుతున్నా, నన్ను ఎంతో మంది ఎన్నో అంటున్నా వాటివల్ల పేరెంట్స్ బాధపడకూడదు పేరెంట్స్ బ్లేమ్ అవ్వకూడదు అని ఆలోచించి ఏ రోజు నేను ఎలాంటి పోస్టులు పెట్టలేదు, వాటిని బయట పెట్టలేదు, ఈరోజు అది ఎవరి ద్వారానో బయటికి వస్తే పాపం సిరి ఏం చేసింది ఒక అమ్మాయి అని చూడకుండా క్యారెక్టర్ బ్లేమ్ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు? మీ అమ్మ గుర్తొచ్చి ఆగిపోయాను'' అని పేర్కొన్నారు.

    సపోర్ట్ లేక పిచ్చోడయ్యేవాడు

    సపోర్ట్ లేక పిచ్చోడయ్యేవాడు

    ఎంతసేపటికీ సిరి వల్ల నెగిటివ్ అయ్యాడు అయ్యాడు అంటారేంటి, ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా, నెగిటివ్ అవ్వడం కాదు ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక పిచ్చోడయ్యేవాడు, ఎందుకంటే వేరే ఎవరితో కలవడు కాబట్టి. ఇక్కడ సిరి వేరే వాళ్ళతో మాట్లాడినా తప్పే డాన్స్ వేసినా తప్పే తప్పే నేనే నీకు ప్రపంచం అని క్రియేట్ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ఇంకా ఎవరి దగ్గరికి వెళుతుంది? ఫ్రెండ్ బాధ పడకూడదు అని ఆలోచించి ఆగుతూ ఉంటే అడ్జస్ట్ అవుతుంటే వీళ్ళు ఇచ్చే వ్యాల్యూ ఇదా? లాస్ట్ మూమెంట్లో ఈ నెగిటివి ఎందుకు అని నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ బయట పెట్టడం లేదు, ఏంటి బ్రదర్ ఇది'' అంటూ వరుసగా మూడు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ షేర్ చేశాడు. వెంటనే వాటిని డిలీట్ చేశారు

    Recommended Video

    Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
    సిరిని ఎలిమినేట్ చేయడానికి

    సిరిని ఎలిమినేట్ చేయడానికి

    అలా అతను పోస్టులు పెట్టి డిలీట్ చేసిన తర్వాత గీతూ రాయల్ అనే మరో సోషల్ మీడియా ఇన్ఫ్లూ యన్సర్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు సిరిని ఎలిమినేట్ చేయడానికి. అదేమో పిచ్చిదాని లాగా షన్ను షన్ను అంటుంది, బయటకు వచ్చినాక ఫాక్ట్స్ తెలుసుకుంటుంది అని చెబుతూ షణ్ముఖ్ తల్లి సిరి ఎలిమినేట్ అవ్వడానికి ట్రై చేయండి అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.

    సిరి వల్ల షన్ను బ్యాడ్ అవుతున్నాడు అంటూ ఆమె అలాంటి కామెంట్లు చేసిందని దానిని తట్టుకోలేకే ఈ పోస్టులు పెట్టి శ్రీహన్ డిలీట్ చేశాడని తెలుస్తోంది. మొత్తం మీద లోపల ఇద్దరి పరిస్థితి అలా ఉంటే బయట వాళ్ళు మాత్రం కొట్టుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    English summary
    Screen shot war between team shanmukh jaswanth and siri lover srihan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X