బిగ్ బాస్‌లోకి డేంజరస్ లేడీ విలన్.. చెడ్డ పేరు వచ్చిన ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశారంటే!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిందే బిగ్ బాస్. మొదట్లో హిందీలో ప్రారంభం అయిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. అలా తెలుగులో కూడా మొదలైంది. అన్ని భాషల కంటే ఇక్కడే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఇందులోకి మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఓ క్రేజీ లేడీని ఎంపిక చేశారని తెలిసింది. ఆ వివరాలను మీరే చూసేయండి!
ఏడు సీజన్లు.. టాప్ రేటింగ్
ఎన్నో అనుమానాల నడుమ బిగ్ బాస్ షో తెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా దేశంలోనే రికార్డు స్థాయి రేటింగ్‌ను అందుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కంప్లీట్ చేసుకున్నారు. దీని ద్వారా ఎంతో మంది స్టార్లుగానూ మారారు. దీంతో ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

8వ సీజన్‌కు రంగం సిద్ధం
బిగ్ బాస్ షోలో ఎన్నో సీజన్లు వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చి సెన్సేషన్ అయింది. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని 'అంతులేని వినోదం' అనే కాన్సెప్టుతో తీసుకు రాబోతున్నారు. దీంతో దీనిపై కూడా హైప్ క్రమంగా పెరుగుతోంది.
ఆరోజు నుంచే అసలైంది
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ప్రసారం చేయబోతున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1వ తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఆదివారం జరిగే ప్రీమియర్ ఎపిసోడ్ కోసం ఇప్పటికే షూటింగ్‌ను సైతం మొదలు పెట్టేశారు. అలాగే, దీని నుంచి ఇప్పుడు ప్రోమోను కూడా వదిలేందుకు రెడీ అవుతున్నారు.
15మంది వస్తున్నారంటూ
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల సెలెక్షన్ ప్రాసెస్ ఎప్పుడో మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే చాలా మందిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లోకి ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, యశ్మీ గౌడ, నిఖిల్, నైనిక, సోనియా ఆకులు, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత సహా మొత్తం 15 మంది హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలిసింది.

మాజీ కంటెస్టెంట్లు అలా
ఎన్నో అంచనాల నడుమ మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో నిర్వహకులు డిఫరెంట్ ప్లాన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇందులోకి మాజీ కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారట. వీళ్లను ఐదో వారంలో హౌస్‌లోకి పంపబోతున్నారని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే 7 - 8 మందిని సెలెక్ట్ చేసుకున్నారని టాక్.
షోలోకి డేంజరస్ విలన్
ఎనిమిదో సీజన్‌లో పంపేందుకు నిర్వహకులు ఇప్పటికే చాలా మంది మాజీ కంటెస్టెంట్లతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఏడో సీజన్ కంటెస్టెంట్‌గా వచ్చి సెన్సేషన్ అయిన శోభా శెట్టిని కూడా సెలెక్ట్ చేశారట. గత సీజన్‌లో ఆమెకు గొడవల ఎంతో చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకునేందుకే ఈ లేడీ విలన్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











