టీవీ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 'దిల్ తో హ్యాపీ హై జీ'షోలో సిమ్మీ ఖోస్లా పాత్రలో నటించిన సెజల్ మరణవార్త తెలియగానే ఆమె సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటో చెబుతూ.. ఓ సూసైడ్ నోట్ కూడా రాసిందని తెలుస్తోంది. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం..

 సెజల్ నేపథ్యం..

సెజల్ నేపథ్యం..

ఉదయపూర్ నుండి 2017లో ముంబై వచ్చిన సెజల్ శర్మ టీవీ నటిగా కొనసాగుతున్నారు. సెజల్ ‘దిల్ తో హ్యాపీ హై జీ'లో నటించడానికి ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించింది. అంతేకాకుండా సెజల్ ‘ఆజాద్ పరిండి' అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

 అవకాశాలు లేక..

అవకాశాలు లేక..

సెజల్ శర్మ ఆత్మహత్యపై ఆమె సహచర నటులు స్పందిస్తూ.. దిల్ తో హ్యాపీ హై జీ షో తరువాత అవకాశాలు రాకపోవడం, ఆర్థికంగా కష్టాలు మొదలవ్వడం, వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం, తండ్రికి క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటివి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుండేవీ.. ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు కనిపించేది కాదని చెప్పుకొచ్చారు.

 అప్పుడే బాగానే ఉంది..

అప్పుడే బాగానే ఉంది..

సెజల్ శర్మ సహ నటుడు అరు కే వర్మ మాట్లాడుతూ.. సెజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపాడు. పది రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని, అప్పుడు బాగానే ఉందని తెలిపాడు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అన్నాడు.

 ఎవరూ బాధ్యులు కారు..

ఎవరూ బాధ్యులు కారు..

తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామని, తదనంతరం ఆమె బాడీని బంధువులకు అప్పగిస్తామని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X