షోలో రెచ్చిపోయిన శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్: బాడీలో వేడి లేదు.. శోభనం గదిలో ఆ పని అంటూ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొంది 'ఢీ' ఒకటి.
చాలా ఏళ్లుగా టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న ఈ షో.. ఇప్పుడు మరింత కొత్తగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరగబోయే ఎపిసోడ్‌లో జడ్జ్‌లుగా ఉన్న శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌లు డబుల్ మీనింగ్‌తో రెచ్చిపోయారు. ఆ వివరాలు మీకోసం!
Photo Credits: Mallemalatv

సౌతిండియాలోనే టాప్: తెలుగులో చాలా చానెళ్లలో డ్యాన్స్ కార్యక్రమాలు వచ్చాయి. కానీ, వాటన్నికంటే ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా ఇది సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లుగానే టీఆర్పీని రాబడుతూ సౌత్ ఇండియా మొత్తంలోనే నెంబర్ వన్ డ్యాన్స్ షోగా వెలుగొందుతోంది.
ఈ సీజన్ ప్యూర్ డ్యాన్స్: తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న 'ఢీ' షో ఇప్పటికే పద్నాలుగు సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదిహేనో దానిని కూడా కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. 'చాంపియన్స్ బ్యాటిల్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. ఇందులో ప్యూర్ డ్యాన్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

వాళ్ల వల్ల సక్సెస్‌ఫుల్‌గా: 'చాంపియన్స్ బ్యాటిల్' పేరిట నడుస్తోన్న 15వ సీజన్‌ను ఏ అండ్ బీ అనే రెండు టీమ్‌ల మధ్య జరుపుతున్నారు. ఈ సీజన్‌కు హైపర్ ఆది, జస్వంత్ పడాల, దివ్యలను మెంటర్లుగా పెట్టారు. జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌లు చేస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు దీన్ని హోస్ట్ చేస్తున్నాడు. వీళ్లందరి వల్ల టీఆర్పీ కూడా భారీగానే దక్కుతూ ఇది మంచిగా సాగుతోంది.
వచ్చే వారం మాస్టర్లతో: రాబోయే బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రతి కంటెస్టెంట్ తమ కొరియోగ్రాఫర్లలో కలిసి డ్యాన్స్ చేసేలా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. ఇందులో చైతన్య మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్‌తో అలరించగా.. పండు మరోసారి లేడీ గెటప్‌తో మాయ చేశాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది.

జెస్సీలో వేడి లేదంటూ: వచ్చే బుధవారం ప్రసారం అయ్యే 'కొరియోగ్రాఫర్' స్పెషల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌ల మధ్యలో జస్వంత్ పడాల, దివ్య మధ్యన ఓ స్కిట్ పెట్టారు. అందులో జస్వంత్ 'దివ్యకు చలిగా ఉందంట. కొంచెం వెచ్చగా ఉంటుందని చెప్పి దగ్గరగా ఉన్నా' అన్నాడు. అప్పుడు శేఖర్ మాస్టర్ 'వెచ్చగా ఉండాలంటే ముందు మనలో వేడి ఉండాలి కదా' అని పరువు తీశాడు.
పూజకు పనికిరాని పువ్వు: శేఖర్ మాస్టర్ వేసిన పంచ్‌కు సెట్‌లో ఉన్న వాళ్లంతా పడి పడి నవ్వుకోగా.. జస్వంత్ మాత్రం షాకై నోరెళ్లబెట్టేశాడు. ఆ తర్వాత తేరుకున్న అతడు 'నా గురించి మీకు తెలీదు' అంటూ సవాల్ చేశాడు. దీంతో జడ్జ్ శ్రద్దా దాస్ 'నాకు తెలుసు. మీరు పూజకు పనికి రాని పువ్వు అంట కదా' అని అంది. దీంతో అక్కడున్న వాళ్లంతా సిగ్గు పడిపోగా.. జెస్పీ మాత్రం ముఖం ఎలాగో పెట్టాడు.
శోభనం గదిలో ఏడుస్తూ: వరుసగా తనపై పంచులు పడుతున్న జస్వంత్ పడాల మాత్రం అస్సలు తగ్గలేదు. ఓ సందర్భంలో అతడు 'షడన్‌గా వచ్చేసి మా ఇంట్లో డోర్ తీయడం లాంటివి చేయకండి. తీస్తే అక్కడ మీకు ఏ సీన్ కనిపిస్తుందో తెలుసా' అన్నాడు. అప్పుడు ప్రదీప్ 'ఆరుగురు పతివ్రతలు సినిమాలో శోభనం గదిలో ఒకరు కూర్చుని ఏడుస్తారు కదా అదా' అంటూ మళ్లీ జెస్పీ పరువు తీసేశాడు.


Click it and Unblock the Notifications











