శేఖర్ మాస్టర్, రోజా మైండ్ బ్లాక్ స్టెప్పులు.. మీ స్థాయి ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి?.. నెటిజన్స్ ఫైర్
బుల్లితెరపై జబర్దస్త్ ఎప్పటికీ ఓ సంచలనమే. అందులో రోజా వేసే స్టెప్పులు, కౌంటర్స్, పంచ్‌లు మరో లెవెల్. అయితే అవే ఇప్పుడు శ్రుతిమించిపోతోన్నట్టు కనిపిస్తోంది. శేఖర్ మాస్టర్‌తో కెమిస్ట్రీ, ఆయనతో వేసే స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి జోడిని మంచి మార్కులే పడ్డాయి. అయితే ఒకానొక టైమ్‌లో వ్యవహారం ముదిరిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఓ ఈవెంట్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉగాది ఈవెంట్..
ప్రతీ పండగకు ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసే జబర్దస్త్ టీమ్.. ఈ ఉగాదికి పండగ సార్ పండగ అంతే.. అనే షోను ప్లాన్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన రెండు ప్రోమోలు అదిరిపోయాయి. మొదటి ప్రోమోలో శాంపిల్‌ను వదలగా.. రెండో ప్రోమోలో సుధీర్ కామెడీ, రొమాంటిక్ స్టెప్స్‌తో టీజర్‌లా వదిలారు.

తాజాతో ప్రోమోతో షాక్..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రోజా, శేఖర్ మాస్టర్ హైలెట్ అయ్యారు. మిగతా వారంతా సైడ్ అయ్యారు. రాఘవ, ఇమాన్యుయెల్ స్కిట్స్ చేసినట్టు అనిపించినా..అందులోని పంచ్‌లను రోజా, శేఖర్ మాస్టర్ పంచుకున్నారు. దీంతో ప్రోమోలో మొత్తం వీరే కనిపించారు.

మైండ్ బ్లాక్ స్టెప్పులు..
సరిలేరు నీకెవ్వరు సినిమాలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన మైండ్ బ్లాక్ సాంగ్‌కు రోజాతో కలిసి కాలు కదిపారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి వేసిన మైండ్ బ్లాక్ స్టెప్పులు విమర్శలకు దారి తీసింది.
Recommended Video

మీ స్థాయి ఏంటి..?
రోజా వేసిన మైండ్ బ్లాక్ స్టెప్పులపై నెటిజన్స్ విరుచుక పడతున్నారు. ఆ క్యాస్టూమ్ అసలు సూట్ అవ్వలేదని, శేఖర్ మాస్టర్‌తో ఆ రొమాన్స్ ఏంటి? అని మండిపడుతున్నారు. ఏది ఏమైనా పండగ సర్ పండగ అంతే ప్రోగ్రామ్ మాత్రం టాప్ రేటింగ్‌లో దూసుకుపోయేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











