twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెల్లం ‘శ్రీదేవీ’ అంటూ స్టెప్పులతో స్టేజ్ మీద రచ్చ.. హీరోయిన్‌తో శేఖర్ మాస్టర్ రొమాన్స్

    |

    శేఖర్ మాస్టర్ వేసే స్టెప్పులు, స్టార్ హీరోలతో ఆయన వేయించే ఐకానిక్ మూమెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెర వెనుక ఉండి రచ్చ చేసే శేఖర్ మాస్టర్ ఇప్పుడు తెర ముందు సందడి చేస్తున్నాడు. బుల్లితెరపై వచ్చే వినోద కార్యక్రమాలకు జడ్జ్‌గా శేఖర్ మాస్టర్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్యే కామెడీ స్టార్స్ అంటూ మొదలైన ఈ షోలో శేఖర్ మాస్టర్ దుమ్ములేపుతున్నాడు.

    డ్యాన్స్‌లో గ్రేస్..

    డ్యాన్స్‌లో గ్రేస్..

    శేఖర్ మాస్టర్ వేసే డ్యాన్సుల్లో గ్రేస్ ఉంటుంది. ఆయన ఎవరి పక్కన వేసినా కూడా అంతే స్టైల్‌గా మూమెంట్స్ వేస్తుంటాడు. రోజా, ప్రియమణి, పూర్ణ ఇలా అందరితోనూ శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటారు. మరీ ముఖ్యంగా రష్మీ, వర్షిణి వంటి వారితో వేసే రొమాంటిక్ స్టెప్పులు మరీ వైరల్ అవుతుంటాయి.

    కామెడీ స్టార్స్‌లోనూ..

    కామెడీ స్టార్స్‌లోనూ..

    ఇక కామెడీ స్టార్స్ అంటూ కొత్తగా మొదలెట్టేసిన ఈ షోలో శేఖర్ మాస్టర్, నాటి హీరోయిన్ శ్రీదేవీలు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జడ్జ్మెంట్, నవ్వులు, కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. తెలుగు సరిగ్గా రాకపోయినా శ్రీదేవీ తన గ్లామర్‌తో నెట్టుకొస్తోంది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శేఖర్ మాస్టర్, శ్రీదేవీలు రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరు వేసిన మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     బెల్లం శ్రీదేవీ అంటూ..

    బెల్లం శ్రీదేవీ అంటూ..

    హీరోయిన్ శ్రీదేవీ పేరు వచ్చేలా.. సుప్రీం సినిమాలోని బెల్లం శ్రీదేవీ నా పెళ్లాం శ్రీదేవీ అనే పాటకు స్టెప్పులు వేశారు. ఇక ఈ పాటకు ఇద్దరూ కలిసిపోయి స్టెప్పులు ఇరగ్గొట్టేశారు. ప్రస్తుతం ఈ కామెడీ స్టార్స్ షో రేటింగ్స్ పరంగా దూసుకుపోతోంది.

     సక్సెస్ సెలెబ్రేషన్స్..

    సక్సెస్ సెలెబ్రేషన్స్..

    మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్ రావడం అందులో 9 పాయింట్ల కంటే ఎక్కువగా వ్యూయర్ షిప్ రావడం, అందులోనూ జబర్దస్త్, ఢీ వంటి షోల కంటే అధికంగా రావడంతో కామెడీ స్టార్స్ టీం ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. అయితే ఇది ఇలాగే టాప్‌లో కంటిన్యూ అవుతుందా?లేదా? అన్నది చూడాలి.

    English summary
    Sekhar Master Dance with Sridevi In Comedy Stars
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X