ఢీ సెట్‌లో అడుగుపెట్టిన శేఖర్ మాస్టర్.. అటు ప్రియమణి ఇటు పూర్ణ.. ఇక రచ్చ రచ్చే!!

బుల్లితెరపై శేఖర్ మాస్టర్‌ను చూడక చాలా రోజులే అవుతోంది. శేఖర్ మాస్టర్ కరోనా బారిన పడటంతో ఢీ షోలో గత కొన్ని ఎపిసోడ్‌లో కనిపించడం లేదు. శేఖర్ మాస్టర్‌కు బదులుగా ముందు యానీ మాస్టర్‌ను తీసుకొచ్చారు. అయితే ముగ్గురు లేడీ జడ్జ్‌లు అవ్వడంతో వర్కౌట్ కాలేదు. అందుకు ఆ తరువాత బాబా భాస్కర్‌ను రంగంలోకి దించారు. బాబా మాస్టర్ ఎంట్రీతో ఢీ షో మళ్లీ పైకి లేచింది. బాబా మాస్టర్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

కరోనా పాజిటివ్..

కరోనా పాజిటివ్..

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నానని శేఖర్ మాస్టర్ ఓ వీడియో ద్వారా తన హెల్త్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా తగ్గిపోయాక ప్లాస్మా ఎవరికో అవసరం ఉందని చెప్పడంతో ఇవ్వడానికి వచ్చానని శేఖర్ మాస్టర్ తన మంచి మనసును చాటుకున్నాడు..

కాస్త గ్యాప్..

కాస్త గ్యాప్..

అయితే కరోనా తగ్గినా కూడా శేఖర్ మాస్టర్ కాస్త గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఢీ సెట్‌లోకి అడుగుపెట్టలేదు. ఈ నెల రోజులు శేఖర్ మాస్టర్ ఇంటి పట్టునే ఉన్నాడు. ఒరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శేఖర్ మాస్టర్ మెరిశాడు.

ప్రత్యేక ఈవెంట్లో..

ప్రత్యేక ఈవెంట్లో..

దసరాకు ఈటీవీ చేస్తోన్న అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో శేఖర్ మాస్టర్ దుమ్ములేపనున్నాడు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన షూటింగ్‌ తరువాతే ఢీ సెట్‌లో శేఖర్ మాస్టర్ అడుగుపెట్టాడు. అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు, అందులో శేఖర్ మాస్టర్ చేసిన రచ్చ తెగ వైరల్ అవుతోంది.

ఢీ ఫ్యామిలీతో..

ఢీ ఫ్యామిలీతో..

మళ్లీ ఢీ ఫ్యామిలీతో కలిసి పని చేస్తున్నాను.. బ్యాక్ టు ఢీ ఫ్యామిలీ అంటూ ప్రియమణి, పూర్ణలతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇక శేఖర్ మాస్టర్ ఢీ లోకి మళ్లీ రావడంతో నెటిజన్లు, ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. శేఖర్ మాస్టర్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

బాబా రచ్చ..

బాబా రచ్చ..

శేఖర్ మాస్టర్ లేని రోజుల్లో బాబా రచ్చ రచ్చ చేశాడు. ప్రియమణి, పూర్ణలతో రొమాన్స్, సుధీర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటూ పంచులు వేసుకుంటూ అందర్నీ ఎంటర్టైన్ చేశాడు. అయితే బాబా కొన్ని సార్లు హద్దులు దాటి సుధీర్ మీద పంచులు వేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X