చిన్నదో వైపు.. పెద్దదో వైపు.. ఆ ఇద్దరితో శేఖర్ మాస్టర్ రొమాన్స్..!!

గత కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కనిపించడం లేదు. ఆయన సెటైర్లు ఆయన మార్క్ జడ్జ్‌మెంట్ షోలో కనిపించడం లేదు. కరోనా సోకడంతో శేఖర్ మాస్టర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకున్నా కూడా కొన్ని రోజులుగా షూటింగ్‌లకు దూరంగానే ఉంటున్నాడు. అయితే మళ్లీ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే అది ఢీ షోకు మాత్రం కాదు. దసరా స్పెషల్ ఈవెంట్ కోసం శేఖర్ మాస్టర్ రంగంలోకి దిగాడు.

ఈసారి అలా..

ఈసారి అలా..

ప్రతీ పండుగకు ఈటీవీలో మల్లెమాల వారు స్పెషల్ ఈవెంట్లను చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులో రోజా, సుధీర్, రష్మీ, స్పెషల్ గెస్ట్‌లు, శేఖర్ మాస్టర్ఇలా అందరూ రచ్చ రచ్చ చేస్తారు. ఈ సారి కూడా దసరాకు అదిరిపోయే ప్లాన్లు వేశారు. అక్కా ఎవరే అతగాడు అంటూ దుమ్ముదులిపే ప్రోగ్రాంను సెట్ చేశారు.

ఈసారి మార్చేశారు..

ఈసారి మార్చేశారు..

ప్రతీసారి స్పెషల్ ఈవెంట్ అంటే రోజానే కనిపిస్తుంది. అందుకే ఈసారి రూటు మార్చారు. హీరోయిన్ సంగీతను తీసుకొచ్చారు. సంగీతను మెయిన్‌గా పెట్టి ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో రష్మీ, వర్షిణిలు సంగీతకు చెల్లెళ్లుగా కనిపించబోతోన్నారు. ఇక ఆ ఇద్దరికి వరుడిని వెతికే పనిలో సంగీత ఉన్నట్టుంది.

శేఖర్ మాస్టర్ గ్రాండ్ ఎంట్రీ..

శేఖర్ మాస్టర్ గ్రాండ్ ఎంట్రీ..

దసరా స్పెషల్ ఈవెంట్ అక్కా ఎవరే అతగాడులో శేఖర్ మాస్టర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గ్యాప్ ఇచ్చాడు కానీ డ్యాన్సులో, ఎంటర్టైన్మెంట్‌లో ఏ మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. వస్తూనే రష్మీ, వర్షిణిలతో రొమాంటిక్ పర్ఫామెన్స్‌ను చేసినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Hero Sudheer Babu Special Interview On 'V' Movie
చెరో వైపు..

చెరో వైపు..

శేఖర్ మాస్టర్ స్టేజీ ఎక్కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగా ఢీ షోలో కూడా రష్మీ, వర్షిణిలతో కలిసి స్టెప్పులేసే వాడు. ఈ ఈవెంట్‌లోనూ ముగ్గురూ కలిసి కుమ్మేసినట్టు కనిపిస్తోంది. ఇక ప్రోమోలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు అనే పాటకు డ్యాన్స్ వేసినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా శేఖర్ మాస్టర్‌ను ఇలా చాలా రోజుల తరువాత చూస్తున్నందుకు నెటిజన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X