ఢీ షోలో రెచ్చిపోయిన సెలెబ్రిటీలు.. నీ *ల్లి జాగ్రత్త.. మన్మధ రాజా అంటూ ఘోరంగా!
తెలుగు బుల్లితెరపై చాలా రకాల కంటెంట్‌లతో షోలు వస్తున్నా.. వాటిలో అతి తక్కువ కార్యక్రమాలు మాత్రమే ఆడియెన్స్ సపోర్టుతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అందులో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన 'ఢీ' ఒకటి. దాదాపు పదిహేనేళ్లుగా బుల్లితెర ప్రియులను అలరిస్తూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పుడు ఈ షో మరో దానితో ముందుకు వచ్చింది. ఇక, ఈ కార్యక్రమంలో సెలెబ్రిటీలు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
భారీ రేటింగ్.. 15 కంప్లీట్:తెలుగులో ఎన్నో చానెళ్లలో డ్యాన్స్ షోలు వచ్చాయి. కానీ, వాటన్నికంటే ఈటీవీలో ప్రసారం అవుతోన్న 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా ఇది సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లుగానే టీఆర్పీ రేటింగ్‌ను సైతం భారీగానే రాబడుతూ సౌత్ ఇండియా మొత్తంలోనే నెంబర్ వన్ డ్యాన్స్ షోగా నిలుస్తోంది.

ఈ సారి ప్రీమియర్ లీగ్:సుదీర్ఘ కాలంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న 'ఢీ' షో ఇప్పటికే పదిహేను సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదహారో దానిని కూడా కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. 'ఢీ ప్రీమియర్ లీగ్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా కొన్ని ఊరి పేర్లతో టీమ్‌లను తీసుకొచ్చారు. వీటిలో రెండేసి జట్ల మధ్య పోటీలు పెడుతున్నారు.

పాయింట్స్ పెట్టి ఫైట్:'ఢీ ప్రీమియర్ లీగ్' పేరిట నడుస్తోన్న 16వ సీజన్‌ను పాయింట్లను ఇస్తూ నడిపిస్తున్నారు. ఈ లీగ్‌లో టాప్‌లో ఉన్న జట్లు ఫినాలేకు చేరనున్నాయి. ఈ సీజన్‌కు హైపర్ ఆది, దీపిక పిల్లిలను మెంటర్లుగా పెట్టారు. జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్, పూర్ణలు చేస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు దీన్ని హోస్ట్ చేస్తున్నాడు. వీళ్లందరి వల్ల టీఆర్పీ కూడా భారీగానే దక్కుతూ వస్తోంది.

హైపర్ గెటప్‌లతో ఆది:'ఢీ ప్రీమియర్ లీగ్' షోలో హైపర్ ఆది ఓ రేంజ్‌లో కామెడీని చేస్తూ మజాను పంచుతున్నాడు. ముఖ్యంగా అతడు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక హీరోకు సంబంధించిన గెటప్‌ను వేస్తున్నాడు. అంతేకాదు, వాళ్ల బాడీ లాంగ్వేజ్, డైలాగులను ఇమిటేట్ చేస్తూ తెగ నవ్విస్తున్నాడు. దీంతో ఈ సీజన్‌లో హైపర్ ఆదినే హైలైట్ అవుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

జెస్సీలో వేడి లేదంటూ:ఈ బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో ఓరుగల్లు వీరులు - హైదరాబాద్ ఉస్తాద్స్, నెల్లూరు నెరజాణలు - సైరా రాయలసీమ జట్ల మధ్య పోటీలు జరుగుతున్నట్లు చూపించాయి. ఇక, ఈ ఎపిసోడ్‌లో భాగంగా హైపర్ ఆది కమెడియన్ వేణు మాధవ్ గెటప్‌తో వచ్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు.

నీ పిల్లి జాగ్రత్త అంటూ:'ఢీ ప్రీమియర్ లీగ్' బుధవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో హైపర్ ఆది.. వేణు మాధవ్‌లా, బలగం రూపలక్ష్మి తెలంగాణ శకుంతలలా స్కిట్ చేశారు. ఆ సమయంలో అతడు స్టేజ్ పైనుంచి దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ సమయంలో ఆది 'అయ్య బాబోయ్ పిల్లి ఏమోగానీ' అనగా.. శేఖర్ మాస్టర్ అందుకుని 'నీ పిల్లి జాగ్రత్త' అని డబుల్ మీనింగ్ డైలాగ్ ఏసేశాడు.
మన్మధ రాజా అతడే:హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయి రచ్చ చేయడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత టీమ్ పెర్ఫార్మెన్స్‌లు చేస్తున్న సమయంలో ఒక జట్టు 'మన్మధ రాజా' అనే పాటకు డ్యాన్స్ చేసింది. అప్పుడు హైపర్ ఆది 'ఆ మన్మధ రాజా మన శేఖర్ మాస్టరే' అని అన్నాడు. దీంతో మాస్టర్ షాక్ అవగా.. అందరూ నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











