శేఖర్ మాస్టర్‌తో బట్టలు ఉతికించిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్.. షాకైపోయిన నవ్వుల రారాజు

శేఖర్ మాస్టర్.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా తెలుగు వాళ్లకు పరిచయమైన వ్యక్తి. టాలీవుడ్‌లోని యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో సైతం స్టెప్పులేపించాడు. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరోవైపు బుల్లితెరపైనా మెరుస్తున్నాడు. తన జీవితాన్ని మలుపు తిప్పిన 'ఢీ' షోకు ప్రస్తుతం జడ్జ్‌గా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్.. కొన్ని ప్రత్యేకమైన షోలలో సైతం మెరుస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన పనితో హాట్ టాపిక్‌గా మారారు.

‘ఢీ'లో సుధీర్‌పై పంచుల వర్షం

‘ఢీ'లో సుధీర్‌పై పంచుల వర్షం

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్రోగ్రాం ‘ఢీ'కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్.. టీమ్ లీడర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌పై పంచుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో అతడిని గుక్క తిప్పుకోనీయకుండా చేస్తుంటాడు. జబర్ధస్త్‌లో నాగబాబు నవ్వినట్లు నవ్వుతూ ఎదుటి వాళ్లను ఇరుకున పెడుతుంటాడు. అందుకే శేఖర్ మాస్టర్‌ను అప్పుడప్పుడూ ప్రత్యేకమైన షోలకు పిలుస్తుంటారు.

జబర్ధస్త్‌లో కూడా మెరిశాడు

జబర్ధస్త్‌లో కూడా మెరిశాడు

శేఖర్ మాస్టర్ జబర్ధస్త్ కామెడీ షోకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జడ్జ్‌ల్లో నాగబాబు గానీ, రోజా గానీ గైర్హాజరైన సమయంలో శేఖర్ మాస్టర్‌ను వారి స్థానాన్ని భర్తీ చేస్తుంటారు. ఆయన ఎంట్రీతో ఈ షో మరింత ఉత్సాహంగా సాగుతూ ఉంటుంది. పార్టిసిపెంట్స్ చేసే కామెడీకి తోడు శేఖర్ మాస్టర్ వేసే పంచులతో ఎన్నో ఎపిసోడ్‌లు సక్సెస్‌ఫుల్‌గా సాగిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్పెషల్ షోలలో తన మార్క్

స్పెషల్ షోలలో తన మార్క్

రెగ్యులర్‌గా వచ్చే షోలలో మాత్రమే కాకుండా ఏదో ఒక పండుగను పురస్కరించుకుని ప్రసారమయ్యే ప్రోగ్రాముల్లో కూడా శేఖర్ మాస్టర్ పాల్గొంటున్నారు. ఆయనకు ఏదో ఒక రోల్ ఇవ్వడమో.. జడ్జ్‌మెంట్ చెప్పించడమో చేస్తున్నారు. దీంతో ఈ షోలలో తన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు శేఖర్ మాస్టర్. దీంతో ఆయనకు సినిమాల్లోనే కాకుండా బుల్లితెర ప్రోగ్రాంలలో కూడా మంచి పేరు వస్తోంది.

ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు

ప్రతీ పండగకు బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషీ చేస్తున్న ఈ స్టార్స్.. ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ‘ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు' అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రోజా, నాగబాబు గొడవ పడడాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. వీరిలో ఏ టీమ్ వాళ్లు గెలిస్తే వాళ్లే తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. ఇలా గతంలోనూ పలు కార్యక్రమాలు వచ్చాయి.

బట్టలు ఉతికించిన బిగ్ బాస్ కంటెస్టెంట్

బట్టలు ఉతికించిన బిగ్ బాస్ కంటెస్టెంట్

ఇక, ఇదే కార్యక్రమంలో శేఖర్ మాస్టర్.. చమ్మక్ చంద్రతో కలిసి ఓ స్కిట్‌లో మెరిశాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ భానుకు భర్తగా నటించాడయన. భార్య కొంగు చాటు భర్తగా కనిపించిన శేఖర్ మాస్టర్.. బట్టలు ఉతకడం, వంట చేయడం వంటివి చేస్తూ పెళ్లాంతో తిట్లు పడుతుంటాడు. ఇందులో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. శేఖర్ మాస్టర్ యాక్టింగ్‌కు నవ్వుల రారాజు నాగబాబు పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకి సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X