For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ మాస్టర్‌కు కరోనా.. గత నెలలో పాజిటివ్ అని తేలిందట.. వీడియో వైరల్

    |

    శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. స్టార్ హీరోలందరికీ మెస్ట్ ఫేవరేట్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక వెండితెరపై హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించే మాస్టర్ బుల్లితెరపై పంచ్‌లతో, సెటైర్లతో దుమ్ములేపుతుంటాడు. తాజాగా శేఖర్ మాస్టర్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.

    బుల్లితెరపై రచ్చ..

    బుల్లితెరపై రచ్చ..

    శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతటి రచ్చ చేస్తాడో అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్, ప్రదీప్, హైపర్ ఆదిలతో కలిశాడంటే పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అదే విధంగా రోజాతో కలిసి స్టెప్పులేస్తే ఇక స్టేజ్ మొత్తం హీటెక్కాల్సిందే. ప్రత్యేక ఈవెంట్లకు రోజాతో కలిసి చేసే స్కిట్స్ ఓ రేంజ్‌లో పేలుతుంటాయి.

    ఢీ షోలో అదుర్స్..

    ఢీ షోలో అదుర్స్..

    ఢీ షోలో శేఖర్ మాస్టర్ స్టైలే వేరు. స్టేజ్ మీదకు వచ్చి స్టెప్పులు వేసిన, విజిల్స్ వేసినా, కుర్చీలో కూర్చుని సుధీర్, ఆది, వర్షిణి, రష్మీలపై పంచ్‌లు వేసినా అది వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే గత రెండు మూడు ఎపిసోడ్‌లకు శేఖర్ మాస్టర్ రావడం లేదు. దానికి కారణం తాజాగా శేఖర్ మాస్టర్ బయట పెట్టాడు.

    కరోనా పాజిటివ్..

    కరోనా పాజిటివ్..

    నాకు నెల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాడు. తగ్గిపోయింది.. ప్లాస్మా ఎవరికో అవసరం ఉందని చెప్పడంతో ఇవ్వడానికి వచ్చాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ప్లాస్మాను దానం చేశాను. కరోనా వచ్చి తగ్గిన వారు యాంటీ బాడీస్ టెస్ట్ చేయించుకోండి.. మీరు కూడా ప్లాస్మాను దానం చేయండి అని శేఖర్ మాస్టర్ కోరాడు.

    #NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
    ఎంతో సంతోషంగా ఉంది

    ఎంతో సంతోషంగా ఉంది

    ప్లాస్మా దానం చేయడం వల్ల ఓ ఇద్దరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. ప్లాస్మాను డొనేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వల్ల ఓ రెండు ప్రాణాలు బతుకుతాయంటే మనకు సంతోషమే కదా అని శేఖర్ మాస్టర్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న శేఖర్ మాస్టర్ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతోన్నట్టు తెలుస్తోంది.

    English summary
    Sekhar Master Tests Corona Positive And Donate Plasma, He says that feels very happy to donate palsma, and saving two lives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X