Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శేఖర్ మాస్టర్‌కు కరోనా.. గత నెలలో పాజిటివ్ అని తేలిందట.. వీడియో వైరల్
శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. స్టార్ హీరోలందరికీ మెస్ట్ ఫేవరేట్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయాడు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక వెండితెరపై హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించే మాస్టర్ బుల్లితెరపై పంచ్‌లతో, సెటైర్లతో దుమ్ములేపుతుంటాడు. తాజాగా శేఖర్ మాస్టర్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.
బుల్లితెరపై రచ్చ..
శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతటి రచ్చ చేస్తాడో అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్, ప్రదీప్, హైపర్ ఆదిలతో కలిశాడంటే పంచ్‌ల వర్షం కురవాల్సిందే. అదే విధంగా రోజాతో కలిసి స్టెప్పులేస్తే ఇక స్టేజ్ మొత్తం హీటెక్కాల్సిందే. ప్రత్యేక ఈవెంట్లకు రోజాతో కలిసి చేసే స్కిట్స్ ఓ రేంజ్లో పేలుతుంటాయి.
ఢీ షోలో అదుర్స్..
ఢీ షోలో శేఖర్ మాస్టర్ స్టైలే వేరు. స్టేజ్ మీదకు వచ్చి స్టెప్పులు వేసిన, విజిల్స్ వేసినా, కుర్చీలో కూర్చుని సుధీర్, ఆది, వర్షిణి, రష్మీలపై పంచ్‌లు వేసినా అది వేరే లెవెల్లో ఉంటుంది. అయితే గత రెండు మూడు ఎపిసోడ్లకు శేఖర్ మాస్టర్ రావడం లేదు. దానికి కారణం తాజాగా శేఖర్ మాస్టర్ బయట పెట్టాడు.
కరోనా పాజిటివ్..
నాకు నెల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. తగ్గిపోయింది.. ప్లాస్మా ఎవరికో అవసరం ఉందని చెప్పడంతో ఇవ్వడానికి వచ్చాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ప్లాస్మాను దానం చేశాను. కరోనా వచ్చి తగ్గిన వారు యాంటీ బాడీస్ టెస్ట్ చేయించుకోండి.. మీరు కూడా ప్లాస్మాను దానం చేయండి అని శేఖర్ మాస్టర్ కోరాడు.
Recommended Video
ఎంతో సంతోషంగా ఉంది
ప్లాస్మా దానం చేయడం వల్ల ఓ ఇద్దరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. ప్లాస్మాను డొనేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వల్ల ఓ రెండు ప్రాణాలు బతుకుతాయంటే మనకు సంతోషమే కదా అని శేఖర్ మాస్టర్ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న శేఖర్ మాస్టర్ త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతోన్నట్టు తెలుస్తోంది.